Venus Transit 2023: కుంభరాశిలో అడుగు పెట్టిన శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అన్ని రకాల సౌకర్యాలు, విలాసాలు లభిస్తాయి

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం..  శుక్రుడు శుభ ఫలితాలు, కళ, అందం, శారీరక ఆనందం, శృంగారానికి కారకుడిగా పరిగణించబడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ 5 రాశుల వారికి అన్ని రకాల సౌకర్యాలు  విలాసవంతమైన జీవితం లభిస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Venus Transit 2023: కుంభరాశిలో అడుగు పెట్టిన శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అన్ని రకాల సౌకర్యాలు, విలాసాలు లభిస్తాయి
Venus Transit 2023
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2023 | 9:18 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు ఒక క్రమంలో తమ రాశుల గమనాన్ని మార్చుకుంటాయి. ఈ గ్రహాల రాశిచక్రంలోని మార్పులు స్థానికులతో సహా దేశాన్ని,  ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. సుఖ సంతోషాలను ప్రసాదించే శుక్ర గ్రహం జనవరి 22 ఆదివారం నాడు శనీశ్వరు డు అధిపతి పతి అయిన కుంభరాశిలోకి ప్రవేశించింది. శుక్రుడు ఫిబ్రవరి 15 వరకు కుంభరాశిలో ఉంటాడు. ఆ తర్వాత బృహస్పతికి చెందిన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఈ గ్రహ సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది, అయితే అధిక ప్రయోజనాలు పొందే కొన్ని రాశుల వారు ఉంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం..  శుక్రుడు శుభ ఫలితాలు, కళ, అందం, శారీరక ఆనందం, శృంగారానికి కారకుడిగా పరిగణించబడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ 5 రాశుల వారికి అన్ని రకాల సౌకర్యాలు  విలాసవంతమైన జీవితం లభిస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

  1. మేషరాశి : శుక్రుడు ఈ రాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వసూలు కానీ డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, ఫీల్డ్‌లో మంచి అవకాశాలు ఉంటాయి. దీంతో వీరు ఆర్ధిక వృద్ధిలో పెరుగుదలను చూస్తారు. మేషరాశి వారికి పితృ సంబంధమైన వివాదాలు ఏవైనా ఉంటే అది పరిష్కారమవుతాయి. సంతాన సంతోషాన్ని పొందుతారు.
  2. మిధునరాశి : ఈ రాశివారి జాతకంలో తొమ్మిదో ఇంట్లో శుక్రుని సంచారం జరుగుతోంది. మిథునరాశి వారికి శుక్రుడు ఐదవ , పన్నెండవ గృహాలకు అధిపతి. గౌరవం పెరుగుతుంది. భౌతిక సుఖాలలో మంచి పురోగతి ఉంటుంది. ధైర్యం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో ప్రయోజనం ఉంటుంది.
  3. సింహరాశి : కుంభరాశిలో శుక్రుని సంచారం ఈ రాశి వ్యక్తుల జాతకంలో ఏడవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఏడవ ఇల్లు భాగస్వామ్యం, వైవాహిక జీవితానికి సంబంధించింది. అటువంటి పరిస్థితిలో.. వ్యాపారంలో గొప్ప లాభం పొందవచ్చు.  ఎవరైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నవారు.. అనేక కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం పొందుతారు. వైవాహిక జీవితంలో ప్రేమ,  సుఖాలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వారు కూడా ఆకస్మిక ధనలాభాలను పొందవచ్చు.
  4. తుల రాశి: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహం లగ్నానికి అధిపతి. తుల రాశి వారికి ఎనిమిదవ ఇల్లు. జనవరి 22, 2023న, శుక్రుడు ఈ రాశివారి జాతకంలో ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఐదవ ఇల్లు విద్య, పురోగతి, ప్రేమ కు ఇల్లు. దీని వల్ల కెరీర్‌లో మంచి విజయాలు, అదృష్టం,  విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు పోటీలో పాల్గొనే విద్యార్థులకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభ రాశి: ఈ రాశి వ్యక్తులలో శుక్రుని సంచారం జాతకంలో మొదటి ఇంటిలో అంటే లగ్న స్థలంలో జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన స్థానికులు శుక్ర గ్రహం నుండి పొందే అన్ని రకాల సుఖాలు, విలాసాలను పొందుతారు. శుక్రుడు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాడు. పిల్లలకి సంబంధించిన ఆందోళనలు తొలగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఇల్లు, వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)