- Telugu News Photo Gallery Spiritual photos Twelve famous hindu temples outside of india which are worth a visit in telugu
Hindu Temple: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అందమైన హిందూ దేవాలయాలు..
భారతదేశం ఆధ్యాత్మిక భూమి. కర్మ భూమి.. అనేక ఆలయాలకు నిలయం. అయితే మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక ఇతర దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. రకరకాల పేర్లతో అక్కడ స్థానికులతో పూజలను అందుకుంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Jan 22, 2023 | 8:34 PM

అంగ్కోర్ వాట్ .. ఈ ఆలయం కంబోడియా దేశంలో ఉంది. ప్రపంచంలో హిందూ మతానికి చెందిన అతిపెద్ద ఆలయం.

పశుపతినాథ్ ఆలయం - నేపాల్‌లోని అతిపెద్ద ఆలయ సముదాయం. ఇక్కడ శివుడు పశుపతిగా పూజలను అందుకుంటున్నాడు.

ప్రంబనన్ ఆలయం - ఇండోనేషియాలోని ప్రసిద్ధి ఆలయం. ఇది 9వ శతాబ్దానికి చెందినది. ప్రంబనన్ ఆలయ గోడలపై రామాయణ ఇతిహాసానికి సంబంధించిన చిత్రాలు చిత్రీకరించబడి ఉంటాయి.

శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం- మలేషియా లోని బటు గుహల్లో సుబ్రమణ్యస్వామి ప్రసిద్ధి చెందింది.

స్వామినారాయణ మందిర్ - లండన్‌లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిరం (నీస్డెన్ ఆలయం).

పతిరకాళి అమ్మన్ ఆలయం- శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లోని ట్రింకోమలీలోని పతిరకాళి అమ్మన్ ఆలయం.. పార్వతి దేవి ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటుంది.

హింగ్లాజ్ మాత దేవాలయం - బలూచిస్తాన్‌లోని లాస్బెలా జిల్లాలో ఉన్న హింగ్లాజ్ మాత దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.

స్వామినారాయణ మందిరం- USAలోని రాబిన్స్‌విల్లేలోని BAPS శ్రీ స్వామినారాయణ మందిరం కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

ఢాకేశ్వరి ఆలయం- బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాలోని దేవాలయం. 51 శక్తి పీఠాలలో ఒకటి.

శ్రీ శివసుబ్రహ్మణ్య స్వామి మందిరం- ఫిజీలో ఉన్న శివ సుబ్రమణ్య స్వామి మందిరం దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా ఖ్యాతిగాంచింది.

తానా లాట్ టెంపుల్ -ఇండోనేషియాలోని బాలిలో అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. సముద్ర తీరంలోని అతి పెద్ద రాయిపై కట్టిన ఆలయం.

పరాశక్తి పచ్చయ్యమ్మన్ ఆలయం- మలేషియా దేశంలో పచ్చాయమ్మన్ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది.
