Astro Tips: వివాహానికి ఆలస్యం అవుతుందా.. జాతక దోష నివారణకు ఈ చర్యలను చేపట్టి చూడండి..

జాతకంలో ఏడవ ఇల్లు భార్యాభర్తలకు సంబంధించినది. ఎవరి జాతకంలోనైనా సప్తమ ఇంట్లో బుధ, శుక్ర గ్రహాలు రెండూ ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది.

Astro Tips: వివాహానికి ఆలస్యం అవుతుందా.. జాతక దోష నివారణకు ఈ చర్యలను చేపట్టి చూడండి..
Marriage
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2023 | 6:48 PM

కొంతమంది అబ్బాయి లేదా అమ్మాయిలకు పెళ్లి చేయాలనీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరదు. అనేక కారణాలతో    వివాహం కుదరడంతో జాప్యం జరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. వివాహం ఆలస్యం కావడానికి కారణం కుండలి దోషం కావచ్చు. వధూవరుల జాతకంలో కొన్ని దోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. జ్యోతిషశాస్త్రంలో వివాహ దోషాన్ని తొలగించడానికి కొన్ని చర్యలు సూచించారు. వీటిని అనుసరించి వివాహానికి సంబంధించిన దోషాన్ని జాతకచక్రం నుండి తొలగించుకోవచ్చు.

కుండలి దోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే  జాతకంలో ఏడవ ఇల్లు భార్యాభర్తలకు సంబంధించినది. ఎవరి జాతకంలోనైనా సప్తమ ఇంట్లో బుధ, శుక్ర గ్రహాలు రెండూ ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. కుజుడు నాల్గవ ఇంట లేదా లగ్న గృహంలో ఉండి, శని సప్తమంలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి వివాహం చేసుకోవాలనే కోరిక కలగదు. ఎవరి జాతకంలోనైనా ఏడవ ఇంట్లో శని, బృహస్పతి ఉన్నప్పుడు.. వివాహం ఆలస్యం అవుతుంది. అంతేకాదు చంద్రుడు రాశి సప్తమంలో బృహస్పతి ఉంటే.. అప్పుడు కూడా వివాహం ఆలస్యం అవుతుంది. కర్కాటకరాశి సప్తమంలో బృహస్పతి ఉన్నప్పుడు వివాహానికి అనేక రకాల ఆటంకాలు ఎదురవుతాయి. ఆడపిల్లల జాతకంలో సప్తమ అధిపతి శని పీడితుడైనప్పుడు వివాహంలో జాప్యం, అనేక ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ జరుగుతూ.. రాహువు ఏడవ ఇంట్లో దోషాలను సృష్టిస్తే.. వివాహం జరిగినా ఆ వివాహం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. గురు లేదా శుక్రుడు లగ్నస్థుడి జాతకంలో ఏడవ ఇంట, 12వ ఇంట లాభపడనప్పుడు.. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయి.

ముందస్తు వివాహానికి జ్యోతిష్య పరిహారాలు:  వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వివాహం ఆలస్యం కావడానికి గురు, శని, కుజుడు కారణాలు.. అటువంటి పరిస్థితిలో, ఈ గ్రహాలు శుభాలను ఇవ్వడానికి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వివాహానికి సంబంధించిన అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవడానికి, శివుపార్వతులను పూజించాలి. పార్వతి దేవి ఆరాధన సమయంలో.. ముత్తైదువులకు పసుపు, కుంకుమ సహా మంగళకరమైన వస్తువులను వాయినంగా సమర్పించాలి.

వివాహం జరగం ఆలస్యం అవుతుంటే.. ఆ యువతీ యువకుడు ఎవరైనా సరే.. గురువారం ఉపవాసం ఉండి, విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించండి.

వివాహం కోరికను నెరవేరడానికి ప్రతిరోజూ ఉదయం గణేశుడితో పాటు సిద్ధి, బుద్ధులను పూజించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)