Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: బిల్వ పత్రం కోయడనికి పూజకు కొన్ని నియమాలున్నాయి.. సోమవారం శివయ్యకు పూజచేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా

శాస్త్రాల్లో బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడానికి కొన్ని నియమాలు పేర్కొన్నాయి. చతుర్థి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, సోమవారాల్లో బిల్వ పత్రాన్ని ఎప్పుడూ కోయవద్దు. సోమవారం శివయ్యకు బిల్వ పత్రాలను ..

Lord Shiva: బిల్వ పత్రం కోయడనికి పూజకు కొన్ని నియమాలున్నాయి.. సోమవారం శివయ్యకు పూజచేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా
Lord Shiva Puja
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2023 | 7:57 PM

హిందూ మతంలో శివుడి ఆదరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివయ్య పూజలో జలం, బిల్వ పత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివపురాణంలో.. బిల్వ పత్రం లేని శివ పూజ అసంపూర్ణం అని పేర్కొన్నారు. శివ లింగానికి జలం తో అభిషేకం చేసి.. బిల్వ పత్రాలను  సమర్పింస్తే చాలు వెంటనే ఆయన సంతోషిస్తాడు. తన భక్తులు కోరిక కోర్కెలు తీరుస్తాడని ఒక నమ్మకం. స్కంద పురాణంలో బిల్వ చెట్టు గురించిన ఓ కథ కూడా ఉంది. పార్వతీ దేవి తన నుదుటిపై ఉన్న చెమటను తుడిచినప్పుడు కొన్ని చెమట చుక్కలు మందర పర్వతం మీద పడ్డాయి. అప్పుడు బిల్వ పత్రం చెట్టు ఉద్భవించింది. బిల్వ చెట్టు సంపద, శ్రేయస్సుకు చిహ్నం. శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల సంపూర్ణ పూజ ఫలితం లభిస్తుంది. ఈరోజు సోమవారం శివయ్యకు బిల్వ పాత్రలను సమర్పించడానికి నియమాలు, ప్రాముఖ్యత, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.

శివపూజలో బిల్వ పత్రం పాముఖ్యత పురాణాల ప్రకారం.. సముద్ర మథనం సమయంలో కాలకూట విషం బయటకు వచ్చినప్పుడు..  విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తన గొంతులో దాచాడు. అయితే ఆ విషాన్ని మెడలో పెట్టుకోవడంతో శివుడిపై ప్రభావం చూపించడం ప్రారంభించింది. అప్పుడు దేవీ దేవతలందరూ ఈ విష ప్రభావాన్ని తగ్గించడానికి శివునికి బిల్వ పాత్రలను తినిపించారు. జలంతో అభిషేకించారు. దీంతో బిల్వ పత్రం, నీటి ప్రభావం కారణంగా.. శివయ్య శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. అప్పటి నుండి, శివునికి బిల్వ పత్రం, నీరు సమర్పించే ఆచారం ప్రారంభమైంది.

ఇంట్లో బిల్వ చెట్టు ప్రాముఖ్యత ఎవరి ఇంట్లో బిల్వ చెట్టు ఉంటుందో.. వారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. శివుని ఆరాధనలో బిల్వ పత్రాన్ని సమర్పించడం ద్వారా అన్ని రకాల దుఃఖాలు దూరమవుతాయి. భక్తుల కోరిన కోరికలు నెరవేరతాయి.  శివలింగంపై బిల్వ పత్రాల్లోని మూడు ఆకులు ఉన్నవి సమర్పించాలి. పుణ్య తీర్థయాత్రలన్నీ ఈ బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఉంటాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

బిల్వ పత్రాన్ని కోయడానికి, శివయ్యకు సమర్పించడానికి నియమాలు శాస్త్రాల్లో బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడానికి కొన్ని నియమాలు పేర్కొన్నాయి. చతుర్థి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, సోమవారాల్లో బిల్వ పత్రాన్ని ఎప్పుడూ కోయవద్దు. సోమవారం శివయ్యకు బిల్వ పత్రాలను  సమర్పించాలంటే.. ఆదివారం రోజునే బిల్వ పాత్రలను చెట్టునుంచి తుంచుకుని ఇంట్లో పెట్టుకోండి.

బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించే సమయంలో ఆకులో మృదువైన ప్రాంతం శివలింగాన్ని తాకాలి. ఉంగరపు వేలు, బొటనవేలు, మధ్య వేలితో బిల్వ పత్రాన్ని పట్టుకుని శివయ్యకు సమర్పించండి. మూడు ఆకులున్న బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించండి, అయితే ఈ ఆకులను ఎప్పుడూ కత్తిరించకూడదు లేదా చింపివేయకూడదు. అంతేకాదు బిల్వ పాత్రలను సమర్పించే సమయంలో శివలింగాన్ని నీటితో అభిషేకించండి.

కోరిన కోర్కెలు తీర్చడం కోసం వ్యాధుల నుండి బయటపడటానికి, శివలింగానికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తారని నమ్ముతారు. అంతేకాదు ఎవరికైనా వివాహం జరగడంలో ఆలస్యం అవుతుంటే.. వారు శివలింగంపై గంధంతో ఓం నమః శివాయ అని రాస్తే, వివాహం త్వరలో నిశ్చయమవుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)