AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Tulsi ఇంట్లో తులసి మొక్కను పొరపాటున కూడా ఈ దిక్కులో ఉంచొద్దట… ఎక్కడ ఉంచాలంటే..!

తులసి మొక్కను నాటడంతో పాటు దాన్ని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యమే.. అదే విధంగా సరైన రోజున నాటడం మంచిది. తులసిని ఉంచే దిశ, ప్రదేశం ముఖ్యమైంది. తులసిని తప్పుడు స్థానంలో ఉంచితే మంచిది కాదట.

Vastu Tips for Tulsi ఇంట్లో తులసి మొక్కను పొరపాటున కూడా ఈ దిక్కులో ఉంచొద్దట... ఎక్కడ ఉంచాలంటే..!
Tulsi Direction
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2023 | 8:07 AM

Share

తులసి మొక్కకు సరైన దిశ : హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో లక్ష్మీదేవి కొలువై ఉన్నందున, ప్రజలు ఈ మొక్కను తమ ఇళ్లలో నాటుకుని, పూజించి, నీళ్లు సమర్పించుకుని, పవిత్రంగా చూసుకుంటారు. సాధారణంగా ప్రజలు తులసి మొక్కను నాటేటప్పుడు సరైన స్థలం, దిశను పట్టించుకోరు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసిని ఎక్కడ ఉంచాలనేది కూడా శాస్త్రం చెబుతుంది. తులసి మొక్కను సరైన దిశలో పెడితే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను నాటడంతో పాటు దాన్ని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యమే.. అదే విధంగా సరైన రోజున నాటడం మంచిది. తులసిని ఉంచే దిశ, ప్రదేశం ముఖ్యమైంది. తులసిని తప్పుడు స్థానంలో ఉంచితే మంచిది కాదట. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను సరైన దిశలో ఉంచడం, నాటడం వల్ల సత్ఫాలితాలు అందుతాయి.

దిక్కు.. మీరు ఇంట్లో తులసిని నాటడానికి, లేదంటే పెంచడానికి సరైన దిశ ఉత్తరం.. తులసీమాతను ఉత్తర దిశలో నాటండి. ఇంట్లో ఈ దిశలో తులసి మొక్కను నాటడం సాధ్యం కాకపోతే, ఈశాన్యంలో కూడా నాటుకోవచ్చు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. గురువారం నాడు తులసి మొక్కను నాటితే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. శనివారము రోజున తులసిని నాటడం వలన ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.

ప్రతికూల ప్రభావం.. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం, వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటారు. అందువల్ల, తులసి మొక్కను దక్షిణ లేదా నైరుతి దిశలో నివారించాలి.

ఇవి కూడా చదవండి

ఇంటి పైకప్పు.. కొందరి జాతకంలో బుధుడు సంపదతో సంబంధం కలిగి ఉంటాడు. అందుచేత తులసి మొక్కను ఇంటి పైకప్పు మీద పెట్టకూడదు. ఇలా చేయడం వలన అశుభ ఫలితాలు వస్తాయి. ధన నష్టాన్ని ఎదుర్కొంటారు.

తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా తులసి మొక్కను పైకప్పుపై ఉంచితే పక్షులు, పావురాలు గూడు కట్టుకుని మురికిగా తయారవుతాయి. అలాగే ఇంటి పైకప్పు మీద తులసి మొక్కను ఉంచడం వల్ల ఉత్తరం వైపు నుండి చీమలు వస్తాయని ఒక నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్