Vastu Tips: అందం కోసం అలా చేస్తున్నారా.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవంటున్న వాస్తు శాస్త్రం

తాజా పువ్వులను ఇంట్లో ఏర్పాటు చేసి.. తరచుగా మారుస్తూ ఉంటే సానుకూల శక్తిని పెంచుతాయి. తాజా పువ్వులు అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తాయి. అదే సమయంలో ఇంట్లో వాడిన లేదా ఎండిన  పువ్వులను అందం కోసం ఇంట్లో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. 

Vastu Tips: అందం కోసం అలా చేస్తున్నారా.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవంటున్న వాస్తు శాస్త్రం
Vastu Tips
Follow us

|

Updated on: Jan 23, 2023 | 12:48 PM

వాస్తు శాస్త్రం అనేది వేదాల నుండి వచ్చిన పురాతన శాస్త్రం. ప్రకృతిలోని పంచ భూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలను వాస్తు రూపకల్పనను సమతుల్యం చేసే పురాతన వేద అభ్యాసం. వేదాల శాస్త్రం , డిజైన్ సిద్ధాంత శాస్త్రంగా పరిగణించబడుతుంది. ఇల్లు, ఆఫీసుల వంటి వాటి నిర్మాణాలను చేసే సమయంలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించడం శుభ సూచకమని విశ్వాసం. సాధారణంగా చెప్పాలంటే.. ఇంటిని నిర్మించే ముందు వాస్తు శాస్త్ర వేత్తలను సంప్రదించాలి. అంతేకాదు.. ఇంటిలో ఏర్పాటు చేసుకునే అలంకార వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్రం పేర్కొంది.

ఇంటిలో వాస్తు శాస్త్ర పద్ధతులను చేర్చడం  వలన ఇంటి సమతుల్యతను పాజిటివ్ ఎనర్జీని మెరుగుపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో లేదా ఆఫీసులో ఎండిపోయిన లేదా.. వాడిన పువ్వులను అందం కోసం అలంకరిస్తే.. అవి ఆ ఇంటి సామరస్యానికి విఘాతం కలిగించేవిగా భావించబడుతున్నాయి.

అయితే తాజా పువ్వులను ఇంట్లో ఏర్పాటు చేసి.. తరచుగా మారుస్తూ ఉంటే సానుకూల శక్తిని పెంచుతాయి. తాజా పువ్వులు అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తాయి. అదే సమయంలో ఇంట్లో వాడిన లేదా ఎండిన  పువ్వులను అందం కోసం ఇంట్లో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం.

ఇవి కూడా చదవండి

భారతీయ సంస్కృతిలో ఎండిన పువ్వులను మృతదేహాలతో పోల్చారు. కనుక ఎండిన పువ్వులు ఇంట్లో ఉంటే..  వీటిని ఇంటి నుండి తీసివేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి అందాన్ని.. మంచి సువాసనను తీసుకుని వచ్చే పువ్వులు.. ఎండితే అవి విషంగా పరిగణిస్తుంది. కొత్త చిక్కులు తీసుకొస్తాయి. ప్రత్యేకించి ముఖ్యమైన జీవిత సంఘటనలను మెమెంటోలుగా ఉంచే పుష్పగుచ్ఛాల గదిలో ఏర్పాటు చేస్తే.. అవి గదిలోని పాజిటివ్ శక్తిని తగ్గిస్తాయి. వాస్తు శాస్త్ర ప్రకారం నిర్జీవంగా ఉన్న ప్లాస్టిక్ మొక్కలు, వాడిపోయిన పువ్వులు  పాజిటివ్ శక్తిని ఆకర్షించవని తెలుస్తోంది.

అయితే ఈ కృతిమ పుష్పాలను లేదా వాడిన పువ్వులను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని నిర్దిష్టమైన నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. వీటిని దుమ్ము, ధూళి లేకుండా తరచుగా శుభ్రం చేయాల్సి  ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిలో పశ్చిమ లేదా తూర్పు దిశలలో  ఏర్పాటు చేసుకోవద్దు. అంతేకాదు ఈ మొక్కలను మెట్ల నుండి దూరంగా ఉంచండి. ఇలా చేయడం వలన ఇంట్లో యజమాని  పురోగతి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. కనుక కృతిమ మొక్కలను ఇంట్లో ఏర్పాటు చేసుకునే విషయంలో వాస్తు టిప్స్ ని పాటించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)