Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips For Prosperity: వ్యక్తిలో ఈ 5 చెడు అలవాట్లున్నాయా అదృష్టం కూడా దురదృష్టంగా మార్చేస్తాయి..

అయితే వ్యక్తి వైఫల్యం, కష్ట నష్టాల వెనుక దురదృష్టం కంటే.. చెడు అలవాట్లే కారణం. జ్యోతిషశాస్త్రంలో.. ఒక వ్యక్తి చెడు అలవాట్ల గురించి వివరంగా వివరించబడ్డాయి. అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి.

Astro Tips For Prosperity: వ్యక్తిలో ఈ 5 చెడు అలవాట్లున్నాయా అదృష్టం కూడా దురదృష్టంగా మార్చేస్తాయి..
Astro Tips In Telugu
Follow us
Surya Kala

|

Updated on: Jan 24, 2023 | 10:21 AM

ఒక వ్యక్తి జీవితంలో చెడు సమయం వస్తే.. అతను అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చెడుకాలం వచ్చినప్పుడు మనిషి ఏ పని చేపట్టినా ఆ పనిలో వైఫల్యాలు, జీవితంలో ఆర్థిక సమస్యలు, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు.. అతను తన జాతకం బాగోలేదని.. విధి రాత ఇంతే అంటూ శపించడం ప్రారంభిస్తాడు. అయితే వ్యక్తి వైఫల్యం, కష్ట నష్టాల వెనుక దురదృష్టం కంటే.. చెడు అలవాట్లే కారణం. జ్యోతిషశాస్త్రంలో.. ఒక వ్యక్తి చెడు అలవాట్ల గురించి వివరంగా వివరించబడ్డాయి. అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

గోళ్లు కొరికే అలవాట్లు: తరచుగా చాలా మందికి వేలు గోర్లు కొరకడం అనే చెడు అలవాటు ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రంలో.. ఈ అలవాటు కారణంగా అనేక రకాల దోషాలు తలెత్తుతాయి. గోళ్లు కొరికే అలవాటు వల్ల ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు.. వ్యక్తి  సంపద, గౌరవం ఆకస్మికంగా కోల్పోతాడు. ఈ అలవాటు వల్ల సమాజంలో పరువు పోయే సందర్భం ఏర్పడుతుంది.

నేలను రాస్తూ నడిచే నడక:  చాలా మంది తమ పాదాలను నేలపై ఈడ్చుకుంటూ నడుస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఈ అలవాటు చాలా చెడ్డదిగా పరిగణించబడుతుంది. ఈ అలవాటు ఉన్న వ్యక్తులు తమ వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ అలవాటు ఉన్న వ్యక్తులు అదృష్టం కూడా దురదృష్టముగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

బూట్లు, చెప్పులు సరిగ్గా పెట్టకపోవడం:  చాలా మంది తమ ఇళ్లలో ఎక్కడబడితే అక్కడ తమ చెప్పులు, బూట్లను విడుస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో చెప్పులు, బూట్లు  చెల్లాచెదురుగా ఉన్న ఇళ్లలో దురదృష్టం ఛాయలు వెంటాడతాయి. ఈ అలవాటు కారణంగా ఒక వ్యక్తి డబ్బును కోల్పోతాడు. వాదోపవాదాలు కొనసాగుతూ ఉంటాయి. మానసిక ఆందోళన కలుగుతుంది.

ఇంట్లో గందరగోళం: ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. లక్ష్మి దేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం అని ఒక నమ్మకం. ఇంట్లోనూ, చుట్టుపక్కలనూ అపరిశుభ్రత ఉన్న కుటుంబ సభ్యుల జాతకంలో ఎటువంటి శుభ యోగం ఉన్నా.. ఆ ప్రయోజనం కలగదు. అటువంటి పరిస్థితిలో.. ఇంటిలో, చుట్టుపక్కల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

వంటగదిలో గజిబిజి:  చాలా మంది ఇళ్లలో.. వంటగదిలో సరుకులు అక్కడక్కడా చిందరవందరగా పడేసి ఉంటాయి. వంటగదిలో.. అర్థరాత్రి పాత్రలను సింక్‌లో ఉంచుతారు. ఈ లోపం కారణంగా వ్యక్తి అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)