Temple: ఆల‌య ఆవరణలో ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయకూడని త‌ప్పులివే.. చేస్తే అరిష్టమే..!

సాధార‌ణంగా చాలా మంది ఆల‌యాలకు త‌ర‌చూ వెళ్తుంటారు. ఆల‌యానికి వెళ్ల‌గానే ముందుగా దైవానికి అంటే గుడి ప్ర‌ద‌క్షిణ చేస్తారు. త‌రువాత లైన్‌లో నిలుచుని దేవీదేవతలను ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డ..

Temple: ఆల‌య ఆవరణలో ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయకూడని త‌ప్పులివే.. చేస్తే అరిష్టమే..!
Mistakes To Avoid In Temple Circumstances
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 24, 2023 | 6:10 PM

సాధార‌ణంగా చాలా మంది ఆల‌యాలకు త‌ర‌చూ వెళ్తుంటారు. ఆల‌యానికి వెళ్ల‌గానే ముందుగా దైవానికి అంటే గుడి ప్ర‌ద‌క్షిణ చేస్తారు. త‌రువాత లైన్‌లో నిలుచుని దేవీదేవతలను ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డ కాసేపు గ‌డిపి బ‌య‌టకు వ‌స్తారు. అయితే కొంద‌రు మాత్రం ఆల‌యానికి వెళ్లినప్పుడు ప‌లు త‌ప్పుల‌ను చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆల‌యానికి వెళ్లిన పుణ్యం ద‌క్క‌కపోవడమే కాక చెడు ప్ర‌భావాలు క‌లిగేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అంతేకాక ఆలయ ఆవరణలో చేయకూడని పనులు చేస్తే అరిష్టమే కాక అనేక ఇబ్బందులు కూడా తప్పవని పెద్దలు చెబుతున్నారు. క‌నుక ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన్ని ప‌నుల‌ను చేయ‌రాదు. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఆల‌యాల‌కు వెళ్లే ఆడవారు ఎప్పుడూ జ‌డ వేసుకుని వెళ్లాలి. పురుషులు అయితే శుభ్రంగా త‌ల దువ్వుకుకుని పోవాలి. అంతేకానీ జుట్టు విర‌బోసుకోని వెళ్ల‌రాదు. ఆడ‌వాళ్లు త‌ప్ప‌ని స‌రిగా జ‌డ వేసుకోవాలి. ఆల‌యానికి వెళ్లిన త‌రువాత త‌ల‌పై ధ‌రించిన వ‌స్రాన్ని తొల‌గించాలి.
  2. దేవాల‌యాల‌నికి చెప్పులు వేసుకునే వెళ‌తారు చాలా మంది. అయితే వాటిని గుడి బయటే వదిలి కాళ్లు శుభ్రంగా కడుగుకొని గుడిలోకి ప్రవేశించాలి. తర్వాత ప్రదక్షిణలు చేసి ధ్వ‌జ‌స్తంభం కుడి ప‌క్క నుండి ఆల‌యంలోకి ప్ర‌వేశించాలి.
  3. ఆల‌య క్షేత్ర పాల‌కుడికి మొద‌ట‌గా న‌మ‌స్కారం చేయాలి. ఆల‌యంలో దేవునికి తప్ప ఇత‌రుల‌కు న‌మ‌స్క‌రించ‌రాదు. పూజారికి కూడా న‌మ‌స్క‌రించ రాదు. ఇలా న‌మ‌స్కారం చేయ‌డం వ‌ల్ల ఆల‌య ద‌ర్శ‌న ఫ‌లితం రాదని పండితులు చెబుతున్నారు.
  4. అలాగే నైవేధ్యంగా మ‌నం తీసుకెళ్లిన వ‌స్తువుల‌ను దేవుడికి స‌మ‌ర్పించి ఒక ప‌క్క‌కు నిల‌బ‌డాలి. దేవుడికి, క్షేత్ర పాల‌కునికి మ‌ధ్య‌లో అస్స‌లు నిల‌బ‌డ‌రాదు. పూజారి శ‌ఠ గోపం(శఠ గోప్యం) పెట్టేట‌ప్పుడు త‌ల‌ను తాక‌రాదు. మ‌నం త‌ల‌ను తాకి అదే చేత్తో తీర్థ‌, ప్ర‌సాదాల‌ను తీసుకున్న‌ప్పుడు వెంట్రుక‌ల‌కు ఉండే బ్యాక్టీరియా శ‌రీరంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. పూజారి నుంచి మనం స్వీక‌రించిన ప్ర‌సాదాన్ని ఆల‌య ప‌రిస‌రాల‌లో లేదా బయట ఎక్కడైనా ఎట్టిపరిస్థితుల్లోనూ కింద ప‌డేయ‌రాదు. పూజ ముగిసిన త‌రువాత ఆల‌యంలో కొద్ది స‌మ‌యం దేవుడికి వీపు చూపించ‌కుండా కూర్చోవాలి.
  7. ఆల‌యంలో ఎట్టి ప‌రిస్థితులోనూ గోళ్లు కొర‌క రాదు. మ‌న‌ గోళ్లు కానీ, జుట్టు కానీ ఆల‌య ప‌రిస‌రాల‌లో ప‌డితే మ‌న‌కు స‌క‌ల పాపాలు చుట్టుకుంటాయ‌ని పండితులు చెబుతున్నారు.
  8. ఆల‌యంలో పెద్ద‌గా న‌వ్వ‌డం కానీ, మాట్లాడ‌డం కానీ, అర‌వ‌డం కానీ చేయ‌రాదు. దీని వ‌ల్ల ఆల‌య ప్ర‌శాంత‌త దెబ్బ తింటుంది. ఆల‌య ప‌రిస‌రాల‌లో తొంద‌ర‌గా న‌డ‌వ‌డం, ప‌రిగెత్త‌డం వంటివి చేయ‌రాదు.
  9. ఆల‌యంలో అస్స‌లు ఆవ‌లించ‌రాదు. ఆల‌యంలో కూర్చున్నంత సేపు దేవుడిపై దృష్టి కేంద్రీక‌రించాలి. ఇలా చేస్తూ త‌రుచూ ఆల‌యాల‌ను ద‌ర్శించ‌డం వ‌ల్ల‌ మ‌న జీవితాల‌లో ప్ర‌శాంత‌త నెల‌కొంటుంది. అనుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయి. ఆల‌యాల‌ను సంద‌ర్శించిన పుణ్య‌ఫ‌లం ల‌భిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.