Chanakya Neeti: శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నారా..? చాణక్యుడి నీతి సూత్రాలను పాటిస్తే చింతలన్నీ తీరినట్లే..!

మహా జ్ఞాని అయిన చాణక్యుడు లక్ష్మి దేవి కటాక్షం ఏ విధంగా పొందాలనే విషయాలను సవివరంగా బోధించాడు. ఆయన బోధించిన నీతిసూత్రాలను పాటించడం ద్వారా శ్రీమహాలక్ష్మి కటాక్షప్రాప్తి..

Chanakya Neeti: శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నారా..? చాణక్యుడి నీతి సూత్రాలను పాటిస్తే చింతలన్నీ తీరినట్లే..!
Chanakya Neeti
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 24, 2023 | 6:36 PM

గొప్ప రాజకీయ వేత్త, దౌత్యవేత్త, తత్వవేత్తగా పేరొందిన చాణక్యుడు.. సామాన్య మానవుడు సమాజంలో ఏ విధంగా రాణించాలనే విషయాలపై అనేక నీతి పాఠాలను బోధించాడు. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను తెలుసుకుని, పాటిస్తే జీవితంలో వ్యక్తి శక్తిగా మారగలడు అనడంలో అతిశయోక్తి లేదు. అన్ని రంగాలవారికి ఉపయోగపడే అనేక నీతి సూత్రాలను బోధించిన చాణక్యుడు.. మన జీవితంలో సూక్ష్మ దృష్టి కలిగి ఉండడం ఎంత అవసరం అనే విషయాన్ని కూడా ఎంతో సవివరంగా బోధించాడు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే సాధారణ మానవుడు మొదలుకొని అతన్ని పాలించే రాజు వరకూ ఏ వ్యక్తి ఎలా తన కర్తవ్య పాలనను నిర్వర్తించాలి..? ఆ క్రమంలో అతను ఎటువంటి దృఢ నిశ్చాయాన్ని, మనసును కలిగిఉండాలి..? వంటి పలు కీలకాంశాల గురించి కూడా చాణక్యుడు వెల్లడించాడు.

అంతటి మహా జ్ఞాని అయిన చాణక్యుడు లక్ష్మి దేవి కటాక్షం ఏ విధంగా పొందాలనే విషయాలను కూడా సవివరంగా బోధించాడు. ఆయన బోధించిన నీతిసూత్రాలను పాటించడం ద్వారా శ్రీమహాలక్ష్మి కటాక్షప్రాప్తి తప్పక కలుగుతుందని కూడా అనేక మంది నమ్ముతుంటారు. అంతేకాక మన చింతలన్నీ తీరుతాయని వారి చెబుతున్నారు. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ మన మీద ఉండాలంటే.. మనం చేయాల్సిన పనులు ఏమిటి..? అసలు చేయకూడనివి ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  1. చాణక్య విధానం ప్రకారం మనం ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తూ..  అసంతృప్తి చెందకూడదు. అంతే కాకుండా అందం, ఆహారం విషయంలో అసంతృప్తిగా ఉండకూడాదు. లభించినదానితో సంతోషంగా, సంతృప్తికరమైన జీవనాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి.
  2. చాణక్య నీతి ప్రకారం జ్ఞానం లేని జీవితం అసంపూర్ణం. జ్ఞానం లేకుండా ఒక వ్యక్తి విజయం సాధించలేడు. అందుకే ప్రతి వ్యక్తికీ జ్ఞానం అవసరం.
  3. ఇవి కూడా చదవండి
  4. చాణక్యుడి ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంచి, చెడు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదా పరిస్థితి ఏర్పడదు.
  5. చాణక్యుని బోధనల ప్రకారం వివాహానంతరం పురుషులు..  ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులు కాకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకుని వస్తుంది.
  6. చాణక్య విధానం ప్రకారం మీ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రతిష్ట ఉన్న వ్యక్తులతో స్నేహం చేయవద్దు. అలాంటి వారి స్నేహం మీకు ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. ఇలాంటి స్నేహాల వలన మీరు కూడా అవమానాలు భరించాల్సి రావచ్చు.
  7. చాణక్య నీతి ప్రకారంఇతరుల తప్పుల నుంచి ఎల్లప్పుడూ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఇలా చేసే వ్యక్తులు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతారు. అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా ముందుకు వెళ్లి అపారమైన విజయాలు సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..