Vastu Tips: ఇంట్లో చెట్లను నాటేముందు పాటించవలసిన వాస్తు నియమాలివే.. లేకపోతే ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులే..!

మనలో చాలా మంది ఇంటి ఆవరణలో చెట్లను పెంచుతుంటారు. అలా చెట్లను పెంచడం వల్ల వాతావరణానికి మేలు జరగడమేకాక మన ఇంటి చుట్టుపక్కల వాయు కాలుష్యాన్ని నిరోధించవచ్చు. అంతేకాక చెెట్లు మంచి నీడను

Vastu Tips: ఇంట్లో చెట్లను నాటేముందు పాటించవలసిన వాస్తు నియమాలివే.. లేకపోతే ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులే..!
Vastu Tips For Plants
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 24, 2023 | 7:18 PM

మనలో చాలా మంది ఇంటి ఆవరణలో చెట్లను పెంచుతుంటారు. అలా చెట్లను పెంచడం వల్ల వాతావరణానికి మేలు జరగడమేకాక మన ఇంటి చుట్టుపక్కల వాయు కాలుష్యాన్ని నిరోధించవచ్చు. అంతేకాక చెెట్లు మంచి నీడను కూడా అందిస్తాయి. అయితే నూటికి తొంభై శాతం మంది తమ ఇళ్లను వాస్తు ప్రకారమే నిర్మిస్తారు. వాస్తు దోషాలు ఉండే ఇంటికి కలిసిరాదని నమ్మకం. మరి ఇంటి ఆవరణలో పెరిగే మొక్కలకు, చెట్లకు కూడా వాస్తు ఉంటుందా..? అంటే అవుననే వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో ఏదైనా మొక్క లేదా చెట్టును పెంచే ముందు తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలి. అలా చేయకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా బాధిస్తాయని వారు అంటున్నారు. మరి చెట్లను నాటే క్రమంలో ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా కానీ, కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు.
  2. ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.
  3. తులసి మొక్కను తూర్పు ద్వారం వైపు ఇంకా ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలి.
  4. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి.
  5. ఉత్తర ద్వారం వారి ఇంటికి వాయువ్యంలో తులసికోట వుండాలి.
  6. ఇక తులసి కోట మొక్క విషయంలో ఈశాన్యంలో ఉంచకూడదు.
  7. ఉత్తర దిశలో కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ ఈ చెట్లు వేయకూడదు
  8. మీకు ఆనవాయి ఉంటే అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి.
  9. ఖచ్చితంగా ఇంటికి నైరుతి దిశలో కొబ్బరి చెట్టు ఉండాలి.
  10. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు.
  11. తమలపాకుల మొక్కను దక్షిణ దిశలో ఇంట్లో పెంచటం శుభం.
  12. దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో పూల కుండీలు వుంచవచ్చును.
  13. పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, ఇంటి ప్రహారీ లోపల వేయకూడదు, ఇంటి బయట పెంచుకోవచ్చు. ఇంటి వాస్తుకి సంబంధం లేకుండా ఉండాలి.
  14. తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు.
  15. క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవచ్చును.
  16. తాటి తుమ్మ ఈత పైనాపిల్ ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..