ఉదయం నిద్ర లేవగానే చూడదగినవి ఏమిటి..? అసలు చూడకూడనివేవి..? తెలుసుకుందాం..
కొంత మంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలసి రాకపోయినా, అంతా చెడే జరుగుతున్నా, ఉదయం నిద్ర లేచి ఎవరి ముఖం చూశామో.. అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటుంటారు. అయితే..

What To See And What Not To See After Wake Up
కొంత మంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలసి రాకపోయినా, అంతా చెడే జరుగుతున్నా, ఉదయం నిద్ర లేచి ఎవరి ముఖం చూశామో.. అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటుంటారు. అయితే వాస్తు శాస్త్రం, మన పూర్వీకుల నమ్మకాల ప్రకారం నిజానికి ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని చూడకూడదు. ఇక అదృష్టం కలసి రావాలంటే నిద్ర లేవగానే మరికొన్నింటిని చూడాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం నిద్ర లేవగానే చూడదగినవి:
- నిద్రలేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే మంచిది. వారి మేధస్సు మనకు కూడా పడుతుందంటారు.
- ఉదయం నిద్ర లేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో, తులసి మొక్కలో దేవతలు ఉంటారు. కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచాక అగ్ని, దీపం చూడాలి. అలాగే యజ్ఞం చేసే వారిని చూసినా శుభం కలుగుతుంది. వాటిని మంగళకరానికి చిహ్నాలుగా భావిస్తారు. అందువల్ల వాటిని చూస్తే అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో మన రూపాన్ని మనం చూసుకోవచ్చు.
- బంగారం, సూర్యుడు, ఎర్ర చందనాలను చూడవచ్చు. దీంతో అన్ని పనులు జరగడమే కాక అదృష్టం కూడా కలసి వస్తుంది.
- ఉదయం నిద్ర లేచాక సముద్రం, గుడి గోపురం, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది.
- దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్ర పటాలు, నెమలి కన్నుల చిత్రాలు, పువ్వులు చూస్తే శుభం కలుగుతుంది.
ఉదయం నిద్ర లేవగానే చూడకూడనివి:
- ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపాలు చేసే వారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతుంటారు.
- జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీలను, బొట్టులేనివారిని చూడరాదు.
- క్రూర జంతువులు లేదా వాటి చిత్రపటాలను కూడా చూడకుండ ఉండడం మంచిది.
- శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం.
గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)
ఇవి కూడా చదవండి

Young Women Worship: గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా..లేదా..? శాస్త్రం వెనుక పరమార్థం ఏమిటి..? తెలుసుకుందాం..

Vastu Tips: నటరాజస్వామి విగ్రహాన్ని ఇంట్లో ఉంచవచ్చా..? ఏయే దేవతా మూర్తుల పూజ నిషిద్ధం..? తెలుసుకుందాం రండి..

Female Naga Sadhus: మహిళా నాగసాధువుల గురించి మీకు తెలుసా..? వారి జీవన శైలి, వస్త్రధారణ ఎలా ఉంటాయో తెలిస్తే షాక్ కావల్సిందే..

Spiritual Philosophy: భగవంతుడు మనల్ని నిజంగా పరీక్షలకు గురి చేస్తాడా..? ప్రముఖ యోగులు, జ్ఞానులు ఏమన్నారో తెలుసుకుందాం రండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..