Kukkuta Sastram: పందెం కోళ్ల పెంపకం అంటే అల్లాటప్పా కాదు.. పుంజుల జన్మ నక్షత్రాలు, సామర్ధ్యం, గెలుపు ఓటమిలను తెలిపేందుకు ఓ శాస్త్రం..

కోడి కొక్కరకో అంటే మిగిలిన ప్రాంతాల్లో కేవలం నిద్ర మాత్రమే లేస్తారు.. అదే కోనసీమలో కోడి కొక్కరకో అంటే కనక వర్షం కురుస్తుంది. అయితే ఈ పందెం కోడి పుంజులకు మనుషులకు ఉన్నట్లు నక్షత్రాలు, జాతకాలూ ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి సమయంలో జరిగే కోడి పందాలులో కుక్కుట శాస్త్రం ప్రముఖ పాత్ర పోశిస్తుంది. ఈ శాస్త్రాన్ని అనుసరించి తమ కోడిని పోటీలకు దింపుతారు. 

Kukkuta Sastram: పందెం కోళ్ల పెంపకం అంటే అల్లాటప్పా కాదు.. పుంజుల జన్మ నక్షత్రాలు, సామర్ధ్యం, గెలుపు ఓటమిలను తెలిపేందుకు ఓ శాస్త్రం..
Kukkuta Sastram
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2023 | 8:14 AM

సంక్రాంతి పండగ అంటే మిగిలిన ప్రాంతాల్లోకెల్లా ఉభయ గోదావరి జిల్లాల్లోనిసందడే వేరు. మిగిలిన ప్రాంతాల్లో సినిమాలు- షికార్లు- అరిసెలు- సకినాలు- గారెలు- బూరెలు కొత్తబట్టలే ప్రధానంగా పండగ సాగితే.. ఇక్కడ మాత్రం కోడి పందేలే మెయిన్ అట్రాక్షన్. భోగి- సంక్రాంతి- కనుమ.. మూడు పండగల పేర్లు వేరై ఉండొచ్చు. కానీ గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ఆ మూడు రోజుల పాటు సాగేది మాత్రం ఒక్కటే. అదే కోడి పందెం. ఐపీఎల్ రేంజ్ లో భారీ బరులు. రాత్రింబవళ్లు ఆడేలా వాటిలో ఫ్లడ్ లైట్లు. చుట్టూ ఫుడ్ స్టాల్స్.. ఇవి చాలవన్నట్టు గుండాట వంటి సైడు జూదాలతో.. భారీ కాక్ కార్నివాల్ జరుగుతుందిక్కడ.

ఏడు నుంచి పది నెలల పాటు బలంగా పెరిగిన కోళ్లు. ఒక్కో కోడి అరవై నుంచి డెబ్భై వేల వరకూ ధర పలికే కోడి పుంజులను కొని.. వాటిని బరిలోకి దించుతారు. అయితే తమ ప్రాంతానికే సంప్రదాయ క్రీడైన కోడి పందెంలోకి దిగి ప్రత్యర్ధి కోడితో తలబడాలంటే.. ఆ కోడికి రకరకాల తర్ఫీదులిస్తారు.. ఇదో పద్ధతి ప్రకారం సాగుతుందంటారు ఇక్కడి వారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా ముప్పై వరకూ రకాలను బరిలోకి దింపుతామనీ.. అంటారు స్థానిక కోళ్ల పెంపకందారులు.

కోళ్ల రంగులను బట్టీ రకాల విభజన చేయటం మాత్రమే కాదు.. వాటికంటూ ఒక జ్యోతిష శాస్త్రం ఉంది. దీనినే కుక్కుట శాస్త్రం అని అంటారు . రంగును బట్టీ, రకాన్నిబట్టీ వాటిని బరిలోకి దింపే ఆచారాన్ని తాము ఫాలో అవుతామంటారు పెంపకందార్లు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పండగ వేళల్లో సాగే పందేల్లో పాల్గొనే కోళ్లంటే అంత ఆషామాషీ కాదు. పందెం కోళ్లను సిద్ధం చేయడమొక వ్యాపారం. చాలా మందికిదో జీవనోపాధి. చిన్నపిల్లగా ఉన్న కోళ్లను పరిశీలించి. వాటిని క్షుణ్ణంగా పరిశీలఇంచి మరీ ఎంపిక చేసి.. ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు.

ఇవి కూడా చదవండి

తామెంతో శ్రద్ధగా పెంచే.. ఈ కోడి పుంజులకు ప్రత్యేక ఆహారం అందిస్తారు. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. కొన్ని కోళ్లకు బోన్ లెస్ చికెన్ కూడా ఆహారంగా ఇస్తారు. పౌష్టికాహారంతో పాటు ఈత తదితర ఎక్సర్ సైజులు చేయిస్తారు. పందెం కోళ్లకంటూ స్పెషల్ క్యూరేటర్లుంటారు. ఆ మూడు రోజుల పాటు ఆ కోళ్లకు సపర్యలు చేయడానికి ప్రత్యేకించీ కొందరుంటారు. అయితే ఈ పందెం కోడి పుంజులకు మనుషులకు ఉన్నట్లు నక్షత్రాలు, జాతకాలూ ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి సమయంలో జరిగే కోడి పందాలులో కుక్కుట శాస్త్రం ప్రముఖ పాత్ర పోశిస్తుంది. ఈ శాస్త్రాన్ని అనుసరించి తమ కోడిని పోటీలకు దింపుతారు.

పందెం కోడి పుంజు రకాలు కోడి పుంజుల్లో దాదాపు ముపై వరకూ రకాలున్నా.. ప్రధానంగా 16 రకాల  కోడి పంజులు వాడుకలో ఉన్నాయి. వీటిని ఈ కల రంగులను బట్టి కోడి పుంజులను రకాలను విభజిస్తారు. కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి , కౌజు, మైల ,పూల ,పింగళ, నల్లబోర, ఎర్రపొడ, ముంగిస, అబ్రాసు, గేరువా  వంటి రకాల పుంజులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

కోళ్ల నక్షత్రాలు:

మనుషులకు నక్షత్రాలు ఉన్నట్లే కోళ్లకు 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అశ్లేష, మాఘ, పుర్వ ఫాల్గుణి, పుబ్బ, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్టా, మూల, పూర్వాపాఢ, ఉత్తరాపాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఉన్నాయి. ఈ నక్షత్రాలను పరిగణలోకి తీసుకుని పుంజుని బరిలోకి దింపుతారు. అంతేకాదు పందెం జరిగే సమయంలో కోడిని వదిలే దిశ కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. వీటన్నిటిని  అనుసరిస్తూ పందెంరాయుళ్లు పక్కా ప్లాన్ తో పందెం బరిలోకి వస్తారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్