Uttarandhra: ఘనంగా శ్రీ శంబర పోలమాంబ జాతర.. నేడు సిరిమాను సంబరం..

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది.  సిరిమానోత్సవం పురష్కరించుకొని భక్తులు పోటెత్తారు.

Uttarandhra: ఘనంగా శ్రీ శంబర పోలమాంబ జాతర.. నేడు సిరిమాను సంబరం..
sri sambara polamamba jatara
Follow us
Surya Kala

|

Updated on: Jan 24, 2023 | 7:21 AM

ఉత్తరాంధ్ర కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ జాతర ఘనంగా జరుగుతోంది. ప్రధాన ఘట్టలైన తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం, అంపక ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గిరిజనుల పెద్ద పండుగగా చెప్పుకునే ఈ పోలమాంబ జాతరకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, తెలంగాణ నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ జాతరకు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేశారు.

శంబర పోలమాంబ జాతర సంక్రాంతి వెళ్లిన మొదటి వారం నుంచి పది వారాల వరకు జరుగుతుంది. మొదటివారం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉచిత దర్శనంతో పాటు పది రూపాయల క్యూ లైన్లు, 50 రూపాయల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసి కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కూడా అన్నివిధాలా సహకరించాలని కోరుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..