Mahila Naga Sadhu: మహిళా నాగ సాధువులు నగ్నంగా ఉంటారా? వీరి జీవితం ఎలా ఉంటుందో తెలుసా..
నాగ సాధువుల్లో ఆడ నాగ సాధువులు కూడా ఉంటారని మీకు తెలుసా. చాలా మందికి నాగ సాధువుల గురించైతే తెలుసు కానీ మహిళా నాగ సాధువులుంటారని మాత్రం తెలియదు. నాగ సాధువులను అఘోరిలని కూడా అంటుంటారు.
సనాతన హిందూ ధర్మంలో మనకు ఎందరో సాధువులు, సన్యాసులు కనిపిస్తారు. వీరిలో అఘోరాలు … నాగ సాధువులు ముఖ్యులు. కుంభమేళాలో నాగ సాధులు ఎక్కువగా కనిపిస్తారు. రహస్య జీవితాన్ని గడిపే నాగ సాధువులు శరీరంపై ధుని బూడిద, నుదుటిపై తిలకం, ముఖం అగ్ని తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. ఈ నాగ సాధువుల రూపం మాత్రమే కాదు వారు నివసించే ప్రపంచం చాలా రహస్యమైనది. నాగ సాధు ఆదిశంకరాచార్య స్థాపించిన వివిధ అఖాడాల్లో ఎల్లప్పుడూ నగ్నంగా ఉండే సాధువులు ఉన్నారు. చలి, ఎండలతో వీరికి సంబంధం లేదు.. ఎంత వేడి ఉన్నా.. విపరీతమైన చలి వేస్తున్నా బట్టలు లేకుండానే జీవిస్తారు. చాలావరకూ నాగ సాధువులు కుంభమేళా సమయంలో దర్శినమిస్తూ ఉంటారు. అయితే వీరిలో ఎక్కువగా పురుషులే.. కానీ నాగ సాధువుల్లో ఆడ నాగ సాధువులు కూడా ఉంటారని మీకు తెలుసా. చాలా మందికి నాగ సాధువుల గురించైతే తెలుసు కానీ మహిళా నాగ సాధువులుంటారని మాత్రం తెలియదు. నాగ సాధువులను అఘోరిలని కూడా అంటుంటారు. అయితే మహిళా నాగ సాధువులు కూడా పురుషుల మాదిరిగానే నగ్నంగా ఉంటారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
భారత దేశం ఋషులు, సాధువులకు నిలయం. అనేక రకాల అఖాడాలు, ఋషులు ఉన్నారు. వీరిలో నాగ సాధువులు కూడా ఉన్నారు. వీరు తమ జీవితాలను అరణ్యాలలో.. చాలా ఏకాంత ప్రదేశాలలో గడుపుతారు. నాగ సాధువును మనం చూసే సందర్భాలు చాలా తక్కువ. వీరు నగ్నంగా ఉంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ, మహాకుంభమేళల్లోనే దర్శనమిస్తుంటారు. ఈ సమయంలో మాత్రమే మహిళా నాగ సాధువులను చూడవచ్చు.
మహిళా నాగ సాధువులు నగ్నంగా ఉంటారా?
నాగ సాధువుల మాదిరిగానే, మహిళా నాగ సాధువులు కూడా చాలా కష్టతరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ మహిళా నాగసాధువులు పురుషుల వలె నగ్నంగా ఉండరు. ఆడ నాగ సాధువులు సాధారణంగా కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు. ఆడ నాగ సాధువులు ఏక వస్త్రాన్ని ధరిస్తారు. ఈ వస్త్రం కుట్టబడదు. ఈ వస్త్రాన్ని గంటి అంటారు. దీనితో పాటు.. మహిళా నాగసాధువు ఎల్లప్పుడూ నుదుటిపై తిలకాన్ని ధరిస్తారు. శరీరానికి భస్మాన్ని పూసుకుంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. వీరిని ‘మాతా’ అని పిలుస్తారు.
మహిళా నాగ సాధువుగా మారడం అంత సులభం కాదు. వీరు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 6-12 సంవత్సరాల వరకు కఠినమైన బ్రహ్మచర్య జీవితాన్ని అనుసరించాలి. ,తనను తాను పూర్తిగా భగవంతుడిని అంకితం చేసుకోవాలి.. ఇలా అనేక ఏళ్ళు పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత గురువు ఆ మహిళను నాగ సాధువుగా మార్చడానికి అనుమతిస్తారు. నాగ సాధువు కావడానికి వారు బతికి ఉండగానే తమ పిండదానం చేసుకుంటారు. అనంతరంశిరో ముండనాన్ని చేసుకుంటారు. ఆపై స్నానం చేసిన తరువాత, స్త్రీలను ఆచారాలతో మహిళా నాగ సాధువులవుతారు.
మహిళా నాగ సాధువుల జీవితం చాలా కష్టం
మహిళా నాగ సన్యాసి అయిన తర్వాత.. ఆమె తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తుంది. ఎల్లప్పుడూ భగవంతుని భక్తిలో నిమగ్నమై ఉంటారు. ఉదయం భగవంతుని ఆరాధనతో రోజుని ప్రారంభిస్తారు. రోజంతా వారు భగవంతుడి ధ్యానంతో జీవిస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పూజలు చేస్తూనే ఉంటుంది. మహిళా నాగ సాధువులను సాధ్వియ మాత అని పిలుస్తారు. అంతేకాదు నాగిన్, అవధూతని అని కూడా సంబోధిస్తారు. వీరు చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తుంటారు. సామాన్యులకు దూరంగా దట్టమైన అడవులలో, కొండలలో, గుహలలో జీవిస్తారు. అరుదైన సమయాల్లో మాత్రమే జనంలోకి వస్తుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)