AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ 5 మొక్కలు ఆర్ధిక సమస్యలను తీర్చడమే కాదు పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి.. ఆ మొక్కలేమిటో తెలుసా

వాస్తు, ఫెంగ్‌షాయ్ ప్రకారం.. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వలన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి. ఈ రోజు ఏ ఏ మొక్కలు ఇంట్లో సంతోషాన్ని, ఆర్థిక ప్రగతిని కలిగిస్తాయో తెలుసుకుందాం.

Vastu Tips: ఈ 5 మొక్కలు ఆర్ధిక సమస్యలను తీర్చడమే కాదు పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి.. ఆ మొక్కలేమిటో తెలుసా
Vastu Tips
Surya Kala
|

Updated on: Jan 26, 2023 | 10:11 AM

Share

హిందూ మతంలో  చెట్లు, మొక్కలు చాలా పవిత్రమైనవి. సానుకూల శక్తిని అందిస్తాయి. హిందూ మతంలో ఉపవాసాలు, పండుగలు చెట్లు మొక్కలకు అంకితం చేయబడ్డాయి. మొక్కలు ఉన్న ఇళ్లలో సహజ సౌందర్యం, సానుకూల శక్తి మరియు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వాస్తు, ఫెంగ్‌షాయ్ ప్రకారం.. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వలన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి. ఈ రోజు ఏ ఏ మొక్కలు ఇంట్లో సంతోషాన్ని, ఆర్థిక ప్రగతిని కలిగిస్తాయో తెలుసుకుందాం.

తులసి మొక్క: హిందూ మతంలో.. తులసి మొక్కకి విశిష్ట స్థానం ఉంది. చాలా పవిత్రమైనది. ఔషధ గుణాలతో నిండి ఉంది. మత విశ్వాసాల ప్రకారం, తులసి మొక్క విష్ణువు , లక్ష్మిదేవికి చాలా ప్రియమైనది. తులసి మొక్కకు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. తులసి ఆకులను విష్ణువు, కృష్ణుడు, హనుమంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం, ఈశాన్య, తూర్పు దిశలలో తులసి మొక్కను నాటడం ద్వారా లక్ష్మీ దేవి, శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. రోజూ తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలకు లోటు ఉండదు.

మనీ ప్లాంట్: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన సంతోషం, సంపద లభిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రంలో  మనీ ప్లాంట్ శుక్ర గ్రహం మొక్కగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈశాన్య దిశలో పెట్టకూడదు.

ఇవి కూడా చదవండి

వెదురు మొక్క: ఫెంగ్ షుయ్ వెదురు మొక్క చాలా పవిత్రమైనది. అదృష్టం, దీర్ఘాయుస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వెదురు మొక్క ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. వెదురు మొక్కను ఎర్రటి రిబ్బన్‌తో కట్టి, గాజు గిన్నెలో నీరు పోసి ఉంచాలి. ఒక గాజు పాత్రలో చిన్న వెదురు మొక్కలను ఎరుపు దారంతో కట్టి, దుకాణం, ఇల్లు ఏ ప్రదేశంలోనైనా ఈశాన్య లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ఆర్థిక పురోగతి ప్రారంభమవుతుంది.

కలువ మొక్క కలువ పువ్వుకు హిందూమతంలో  విశిష్ట స్థానం ఉంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆర్థిక పురోగతి ప్రారంభం అవుతుంది.  ప్రతికూల శక్తి పోతుంది. ఇంట్లో ఆర్థిక పురోగతి కోసం ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచాలి.

క్రాసులా మొక్క ఫెంగ్ షుయ్ ప్రకారం క్రాసులా మొక్క ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. ఇది ఇంటి ప్రవేశద్వారం లోపల ఉంచాలి. ఈ మొక్క అయస్కాంతంలా డబ్బు , సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)