AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratha Saptami: అరసవిల్లి సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.. నేటి అర్ధరాత్రి సుప్రభాత సేవతో ప్రారంభం

రేపు రథ సప్తమి సందర్భంగా శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అర్ధ రాత్రి నుండే వేడుకలు ప్రారంభం కానున్నాయి.  ఈరోజు రాత్రి 12 గంటల 30 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ అంతరం అభిషేకాలు నిర్వహిస్తారు.

Ratha Saptami: అరసవిల్లి సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.. నేటి అర్ధరాత్రి సుప్రభాత సేవతో ప్రారంభం
Arasavalli Temple
Surya Kala
|

Updated on: Jan 27, 2023 | 10:12 AM

Share

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథ సప్తమి వేడుకలకు సిద్దమైంది. రథ సప్తమి సందర్భంగా ఈ యేడాది సుమారు లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రధసప్తమి సందర్భంగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ప్రతి ఏటా మాఘసుధ్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి వేడుకలను ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం అయిన శ్రీకాకుళం జిల్లా శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రేపు రథ సప్తమి సందర్భంగా వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అర్ధ రాత్రి నుండే వేడుకలు ప్రారంభం కానున్నాయి.  ఈరోజు రాత్రి 12 గంటల 30 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ అంతరం అభిషేకాలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం 4వరకు భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కొనసాగనుంది. ఆ తరువాత అలంకారంలో స్వామి వారు శనివారం రాత్రి 11గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శనివారం రాత్రి ఏకాంత సేవతో రథ సప్తమి వేడుకలు ముగియనున్నాయి. స్వామి వారి దర్శనానికి సుమారు లక్ష మంది భక్తులు వరకు  రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

రథ సప్తమి వేడుకలు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖా అన్ని ఏర్పాట్లు చేసింది. ఉచితదర్శనం కి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్ లను ఏర్పాటు చేశారు. ఉచిత ప్రసాదము మంచినీటి సౌకర్యము, చిన్న పిల్లలకు వేడి పాలు బిస్కెట్లు అందించే ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులకు వృద్ధులకు 80 ఫీట్ రోడ్డు నుండి అరసవల్లి దేవస్థానం వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. వి ఐ పి ల కోసం ఈ ఏడాది రూ.500 చెల్లించి వి.ఐ.పి టిక్కెట్లును అందించనున్నారు. ఉచిత దర్శనంతో పాటు వంద రూపాయలు, రూ. 500 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉందనున్నవి. అంతేకాదు ఆలయ అభివృద్ధికి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతలకు డోనర్ పాస్ లను ఏర్పాటు చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

రథ సప్తమి వేడుకల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తును శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. గార వైపు నుంచి శ్రీకాకుళం వచ్చే వాహనాలను దారిమల్లిస్తున్నారు పోలీసులు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 80 ఫీట్ రోడ్డు వద్ద, గార, శ్రీకూర్మం వైపు నుండి వచ్చే వాహనాలకు వాడాడ జంక్షన్ వద్ద పార్కింగ్ కల్పిస్తున్నారు.

Reporter:- S.Srinivas

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..