Maha Shivaratri: మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబల కల్యాణానికి.. బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. 

Maha Shivaratri: మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
Srisailam Temple
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2023 | 7:50 AM

మాఘమాసంలో వచ్చే పండగల్లో ఒకటి మహా శివరాత్రి. హిందువుల జరుపుకునే పండగల్లో ముఖ్యమైన పండగ మహా శివరాత్రి . ఈరోజు లింగోద్భవం జరిగిందని పురాణాల కథనం. అంతేకాదు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబల కల్యాణానికి.. బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.

శ్రీశైలం దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు ఈవో లవన్న. కృష్ణ దేవరాయగోపురం, నాగులకట్ట, అమ్మవారి ఆలయం , కల్యాణ మండపం, శ్రీస్వామివారి నిత్య కల్యాణ మండప ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రస్తుస్తుతం క్యూలైన్లకుంటే కొంచెం ఎత్తులో మరో క్యూలైన్‌ ఏర్పాటు చేసే భక్తులు స్వామివారిని సులువుగా దర్శించుకుంటారని అభిప్రాయపడ్డారు. వీవీఐపీలకు, వీఐపీలకు వేర్వేరూగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

కల్యాణ కట్ట దగ్గర శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి మహాపాదయత్రగా వచ్చే భక్తుల కోసం కూడా ఏర్పా్ట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..