Vastu Tips: ఆర్ధిక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. ఇంట్లో పశ్చిమ దిక్కులో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి పశ్చిమానికి వరుణుడు అధినాయకుడు. అంతేకాదు.. ఈ పశ్చిమ దిశలో శని దేవుడుకి పూజలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో.. పశ్చిమ దిశలో వాస్తుకు సంబంధించిన ఏదైనా లోపం ఉంటే.. ఆ ఇంట్లోని వ్యక్తి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. మన చుట్టూ సానుకూల, ప్రతికూల శక్తులు ఉన్నాయి. ఇవి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రంలో ప్రతి దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలి.. ఏ దిశలో ఉంచకూడదు నిర్ణయించారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి దిశకి అధిదేవత ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో నివసించే వారి జీవితాలపై పడమర దిశ ప్రభావం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం పశ్చిమ దిశ ప్రాముఖ్యత వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి పశ్చిమానికి వరుణుడు అధినాయకుడు. అంతేకాదు.. ఈ పశ్చిమ దిశలో శని దేవుడుకి పూజలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో.. పశ్చిమ దిశలో వాస్తుకు సంబంధించిన ఏదైనా లోపం ఉంటే.. ఆ ఇంట్లోని వ్యక్తి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం.. పశ్చిమ దిశలో శని ప్రభావం కారణంగా.. ఈ దిశలో కూర్చుని పని చేయడం నిషేధించబడింది. అంతేకాదు ఈ దిశలో కూర్చోవడం.. నిద్రపోవడం రెండూ నిషేధించబడ్డాయి. ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు లేదా పడుకునేటప్పుడు తన ముఖాన్ని పడమర దిశలో ఉంచుకుంటే.. అతను మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
వాస్తు నియమాల ప్రకారం.. ఇంటికి పడమర వైపు ఎత్తు ఎప్పుడూ ఇంట్లోని ఇతర భాగాల కంటే ఎక్కువగా ఉండాలి. ఇంట్లో ఈ వాస్తు దోషం ఉండటం వల్ల మనిషికి శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ లోపం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. వాస్తు ప్రకారం, పొరపాటున కూడా ఇంటికి పడమర దిశలో వంటగదిని నిర్మించకూడదు. దీంతో అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటి ప్రధాన ద్వారం పడమర దిశలో ఉంటే.. ఆ ఇంట్లో నివసించేవారి దగ్గర డబ్బు ఉండదు.ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఇంటి నుంచి నీరు పడమర దిక్కు గుండా ప్రవహిస్తుంటే.. ఆ ఇంట్లో నివసించే సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది.
పశ్చిమ దిశలో వాస్తు దోష నివారణలు ఒక వ్యక్తి ఇంటికి పశ్చిమ దిశకు సంబంధించి ఏదైనా వాస్తు దోషం ఉంటే.. ఆ వ్యక్తి ఈ దిశలో అశోక వృక్షాన్ని నాటాలి. అంతేకాదు ఈ దిశ నుండి వాస్తు దోషాలను తొలగించడానికి వాస్తు యంత్రాన్ని ఉపయోగించడం ప్రయోజనకరం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)