Kanha Music Fest: మూడేళ్ళలో రాగాలను గుర్తించింది ఒకరు.. హిందుస్థానీ శాస్త్రీయ రంగంలో ఖ్యాతిగాంచింది మరోకరు.. శశాంక్, సంజీవ్ ప్రస్థానం

నేడు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో  ప్రముఖ సంగీత విధ్వంసులైన సంజీవ్ అభ్యంకర్, శశాంక్ సుబ్రమణ్యంలు తమ మ్యుజిక్ జుగల్‌బందీతో సంగీత ప్రియులను అలరించనున్నారు. నేటి తరానికి స్ఫూర్తి ఈ మాస్ట్రో సంగీత విద్వాంసుల గురించి తెలుసుకుందాం..

Kanha Music Fest: మూడేళ్ళలో రాగాలను గుర్తించింది ఒకరు.. హిందుస్థానీ శాస్త్రీయ రంగంలో ఖ్యాతిగాంచింది మరోకరు.. శశాంక్, సంజీవ్ ప్రస్థానం
Sanjeev Shasank
Follow us

|

Updated on: Jan 28, 2023 | 1:07 PM

హైదరాబాద్ కన్హా శాంతి వనంలో శ్రీరామ చంద్ర మిషన్ ఆది గురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జయంతి వేడుకల్లో మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ సంగీత కళారాధనలో  అంతర్జాతీయ సంగీత విద్వాంసులు తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో  ప్రముఖ సంగీత విధ్వంసులైన సంజీవ్ అభ్యంకర్, శశాంక్ సుబ్రమణ్యంలు తమ మ్యుజిక్ జుగల్‌బందీతో సంగీత ప్రియులను అలరించనున్నారు. నేటి తరానికి స్ఫూర్తి ఈ మాస్ట్రో సంగీత విద్వాంసుల గురించి తెలుసుకుందాం..

ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మేవాటీలో సంగీత మాస్ట్రో.. భక్తి సంగీత రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కళాకారులు సంజీవ్ అభ్యంకర్. అత్యంత ప్రజాదరణ పొందిన కళాకారులు నేటి యువ తరానికి స్ఫూర్తి. తన అద్భుత గానంతో యువ తరాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతం వైపు ఆకర్షించారు. 25 సంవత్సరాలకు సంగీత రంగంలో తన సేవలను అందిస్తున్నారు. అంకితభావం, కృషి, సహనం, పట్టుదలతో యూత్ కు రోల్ మోడల్‌గా నిలిచారు.

సంజీవ్ అభ్యంకర్ 5వ తేదీ అక్టోబర్ 1969 న మహారాష్ట్రలోని పూణేలో శోభా అభ్యంకర్‌ జన్మించారు. ఎనిమిదేళ్ల వయస్సులో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. తల్లే సంజీవ్ కు మొదటి గురువు. అనంతరం గురువు పింపాల్ఖరే, పండిట్ జస్రాజ్ లు సంజీవ్ ను తీర్చిదిద్దారు. పండిట్ సంజీవ్ అభ్యంకర్  మేవతి ఘరానాకు చెందిన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు. తన 11వ ఏట 1981 లో ముంబైలో తన మొదటిసారిగా కచేరినిచ్చారు. 1999 లో గాడ్ మదర్ సినిమాలోని సునో రే భైలా సాంగ్ కు గాను ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.  మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి 2008లో కుమార్ గంధర్వ జాతీయ అవార్డును అందుకున్నారు. తన సంగీతం, గానంతో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రశంసలను అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

వేణుగాన విద్వాంసులు శశాంక్ సుబ్రహ్మణ్యం

ప్రముఖ కర్ణాటక సంగీత వేణుగాన విద్వాంసులు శశాంక్ సుబ్రహ్మణ్యం. మూడేళ్ళ వయసులో మొత్తం 72  రాగాలను గుర్తించిన అసాధారణ బాలుడు.. 6వ యేటనే కచేరీ చేయడం మొదలుపెట్టిన బాలమేధావి..శశాంక్. ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన చెవాలియర్ అవార్డును  గెలుచుకుని కర్నాటక నుంచి ఈ గౌరవం పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

కర్ణాటకలోని హసన్ జిల్లా రుద్రపట్న గ్రామంలో సుబ్రహ్మణ్యం, హేమలత దంపతులకు 1978, అక్టోబర్ 14న జన్మించాడు. శశాంక్ తండ్రి MN సుబ్రమణ్యం, బెంగళూరులోని అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.. అయితే తన తనయుడు  శశాంక్ సృజనాత్మక మేధావిని ప్రోత్సహించడానికి తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. కర్ణాటక సంగీతాన్ని తండ్రి వద్ద ఓనమాలు దిద్దుకున్నారు.. అనంతరం.. ఆర్.కె.శ్రీకంఠన్ వద్ద, పాల్గాట్ కె.వి.నారాయణస్వామి వద్ద అభ్యసించారు. హిందుస్తానీ సంగీతాన్ని పండిట్ జస్రాజ్ వద్ద నేర్చుకున్నారు. అయితే  వేణుగానం మాత్రం ఏకలవ్యుడిలా స్వయంగా నేర్చుకున్నదే.

1986లో కుటుంబం బెంగళూరు నుంచి చెన్నైకి మారింది. 1984లో ఆరేళ్ళ వయసులో మొదటి కచేరీ చేశారు. అనంతరం.. అడిలాయిడ్, ఆస్ట్రేలియా, కౌలాలంపూర్, మలేసియా, సింగపూర్ మొదలైన చోట్ల అనేక కచేరీలు నిర్వహించాడు. భరతనాట్య కళాకారిణి శిరీషను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమార్తె స్వర, కుమారుడు సమ్విత్ ఉన్నారు.

హిందుస్థానీ సంగీతం నేర్చుకోవడం వల్ల శశాంక్ సంగీతాన్నీ వినూత్నంగా ఆవిష్కరించాడు. తన కర్ణాటక ప్రదర్శనలలో మరింత శ్రావ్యతను తీసుకుని వచ్చారు. వాస్తవానికి శశాంక్ సోలో గా కచేరీలు ఇచ్చినా.. జుగల్‌బందీలను ఆస్వాదిస్తారు. జుగల్‌బందీ బహుత్వ భారతదేశ సంగీతాన్ని అందించడానికి ఒక అందమైన మార్గమని భావిస్తారు. ఎక్కువగా దేశ విదేశ సంగీతకారుల ప్రదర్శనలకు సహకారం అందించాడు. జాన్ మెక్ లాగ్లిన్, పాకో డి లూసియా, షాంక్సి సింఫొనీ ఆర్కెస్ట్రా, న్యూ జంగిల్ ఆర్కెస్ట్రా, మిక్కెల్ నార్డ్సో, టెర్రీ రిలే, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, జాకిర్ హుసేన్, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్, విశ్వమోహన్ భట్, రోను మజుందార్, ఉస్తాద్ షుజాత్ ఖాన్, దేబూ చౌదరి మొదలైన కళాకారులకు వేణు గాన సహకారాన్ని అందించాడు.

ఇతడు సంప్రదాయ భారతీయ సంగీత కచేరీలతో పాటు సింఫనీలు, జాజ్, సినిమాలు ఇతర తరహా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. బి.బి.సి. ఇతని జీవితంపై 2006లో డెస్టినేషన్ మ్యూజిక్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రసారం చేసింది. శశాంక్  వేణునాదంలో అనేక ప్రయోగాలు చేశాడు. చారుకేశి, స్పిరిట్ ఆఫ్ కృష్ణ, సుందర, మోహన, బిందుమాలిని, ఉత్సవ్, రాగ లతాంగి, రసాయన, మార్గళి మెలోడీస్ మొదలైనవి చాలా ఫేమస్. శశాంక్ తరచుగా ఆన్‌లైన్‌లో బోధిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు