Tirumala: తిరుమలలో వైభవంగా రథ సప్తమి.. భారీగా భక్తుల రద్దీ.. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు

రథ సప్తమి సందర్భంగా నేడు సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. దీంతో తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.

Tirumala: తిరుమలలో వైభవంగా రథ సప్తమి.. భారీగా భక్తుల రద్దీ.. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2023 | 6:49 AM

తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య ప్రభ వాహనంపై  మలయప్పస్వామి దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథ సప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. నేడు శ్రీవారు సప్తవాహనాలపై దర్శనం ఇవ్వనున్నారు.  శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీవారు భక్తులు రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు గా భావిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు.

రథ సప్తమి సందర్భంగా నేడు సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. దీంతో తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం మాడ వీధుల్లోని గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, అన్న పానియాలు వితరణ చేస్తున్నారు.  రద్దీకి తగినవిధంగా అక్కడక్కడా తాత్కాలిక షెడ్లు ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ భక్తులకు వసతి సదుపాయాలు లేకపోవడంతో చలిలోనే స్వామివారి దర్శనం కోసం ఆరుబయట గడిపేస్తున్నారు.

రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది. భక్తులకు అందుబాటులో స్వామివారి ప్రసాదం 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ ఉంచుకుంది.

ఇవి కూడా చదవండి

తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్