Surya Kala |
Updated on: Jan 28, 2023 | 11:22 AM
తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య ప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథ సప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది.
సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. దీంతో తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది
రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది.
సూర్యప్రభ వాహనం వాహనంపై ఊరేగిన శ్రీవారు
చిన్నశేష వాహనంపై భక్తులకు కనువిందు చేసిన మలయప్ప స్వామి