Ratha Saptami: ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం సూర్య జయంతి నేడు.. పూజా సమయం, విధానం మీ కోసం
సూర్య భగవానుడి పుట్టినరోజుగా రథ సప్తమిని జరుపుకుంటారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం చేసి.. తనని పూజిస్తారో.. వారిపట్ల సూర్యభగవానుడు ప్రసన్నం అవుతాడని వారు ఎటువంటి వ్యాధుల బారిన పడరని విశ్వాసం. ఈరోజు పూజా సమయం ఏమిటి, ఎలా పూజించాలో తెలుసుకుందాం.
హిందూ సనాతన ధర్మంలో సూర్య భగవానుని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రోజూ సూర్యభగవానుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అయితే రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, రథ సప్తమి ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్ల పక్షంలోని సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం.. సూర్య భగవానుడి పుట్టినరోజుగా రథ సప్తమిని జరుపుకుంటారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం చేసి.. తనని పూజిస్తారో.. వారిపట్ల సూర్యభగవానుడు ప్రసన్నం అవుతాడని వారు ఎటువంటి వ్యాధుల బారిన పడరని విశ్వాసం. ఈరోజు పూజా సమయం ఏమిటి, ఎలా పూజించాలో తెలుసుకుందాం.
పూజ శుభ సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం.. రథ సప్తమి రోజున చేసే స్నానానికి, దానాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. జిల్లేడు రేగు పండుతో నది స్నానమాచరిస్తారు.
ఎలా పూజించాలంటే.. రథ సప్తమి రోజున ముందుగా పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. నీటిని సమర్పించేటప్పుడు గాయత్రీ మంత్రాన్ని కూడా జపించాలి. దీని తరువాత వీలైతే నది దగ్గరాలు వెళ్లి శివపార్వతులను ప్రతిష్టించండి. పూజించండి. అలా కుదరని పక్షంలో సూర్యభగవానుడి పటాన్ని ఇంట్లో ఉంచి దానిపై ఎర్రచందనం, ఎర్రపూలు, అక్షతలతో పూజలు నిర్వహించండి. పూజానంతరం, నిరుపేద వ్యక్తికి దానం చేయండి. అంతేకాదు బ్రాహ్మణుడికి ఆహారం అందించండి.
ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత.. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. రథసప్తమి నాడు ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున పండ్లను మాత్రమే స్వీకరించండి. సాత్వికాహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. భక్తి శ్రద్దలతో సూర్యభగవానుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)