Ratha Saptami: అరసవెల్లి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. స్వామివారి నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు..

అరసవెల్లి లోని సూర్యనారాణ ఆలయంలో అర్ధరాత్రి తర్వాత రథ సప్తమి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. ముందుగా వేదపారాయణతో ఆదిత్యుని మూల విరాట్టుకు క్షీరాభిషేకం నిర్వహించి త్రిచ, సౌరం, అరుణం, నమకం, చమకాలతో అభిషేకం నిర్వహించనున్నారు వేద పండితులు.

Ratha Saptami: అరసవెల్లి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. స్వామివారి నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు..
Ratha Saptami
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2023 | 8:17 AM

శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అర్థరాత్రి నుంచి రథసప్తమి ఉత్సవం ప్రారంభమైంది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి నిజరూప దర్శనం భక్తులు బారులు తీరారు. శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అర్ధరాత్రి నుంచి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదినారాయణుడిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహార్ లాల్, ఎమ్మెల్యే లు జోగులు, కిరణ్, MLC లు దువ్వాడ శ్రీనివాస్, విక్రాంత్ లు దర్శించుకున్నారు.

ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు చెప్పారు.  జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ.. ప్రజానీకానికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పారు. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని .. దేవుడి ఆస్తులను కాపాడటం తమ బాధ్యత అని చెప్పారు. భూముల పరిరక్షణకు చట్టంలోని లొసుగులను గురించి చట్టాన్ని పటిష్టం చేసామని తెలిపారు. అంతేకాదు  అన్యాక్రాంతం అయిన దేవాలయానికి చెందిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే గుంటూరు, అనకాపల్లి, విజయనగరంలో వందలాది కోట్లు భూములను స్వాధీనం చేసుకున్నామని.. శ్రీశైలంలో 4700 ఎకరాలు భూమి చూట్టూ అన్యాక్రాంతం కాకుండా బౌండరీలు ఫిక్స్ చేస్తున్నామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అంతేకాదు అత్యంత పురాతన ఆలయంగా ఖ్యాతి గాంచిన అరసవిల్లి ఆలయం మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..