Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Graha gocharam 2023: ఫిబ్రవరిలో ఈ గ్రహాల మార్పు.. ఆ 5 రాశుల వారికి బంపర్ ఆదాయం!

బంధుమిత్రుల సహకారంతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఈ కాలం వ్యాపారులకు కూడా అనుకూలమైనది. కొత్త ఆర్డర్లు చేతికందుతాయి.

Graha gocharam 2023: ఫిబ్రవరిలో ఈ గ్రహాల మార్పు.. ఆ 5 రాశుల వారికి బంపర్ ఆదాయం!
Grah Gocharam
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 28, 2023 | 7:59 AM

జనవరి నెల ముగియబోతోంది. ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటాయి. వీటిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, నెప్ట్యూన్ ఉన్నాయి. ఈ గ్రహాల రాశిని మార్చడం వల్ల కలిగే ప్రభావం దేశం, ప్రపంచం, ఆర్థిక వ్యవస్థ12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది. ఏదైనా గ్రహం తనకు కావలసినప్పుడు తన గమనాన్ని మార్చుకుంటుంది. ప్రధానంగా ఫిబ్రవరి 7న గ్రహాలకు రాజుగా పరిగణించే బుధుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 27న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ, సూర్యుడు,శనితో, త్రిగ్రాహి, బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 13 న, సూర్యుడు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 15 న, శుక్రుడు తన ఉన్నతమైన రాశి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.ఫిబ్రవరి 18న నెప్ట్యూన్ మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నెప్ట్యూన్‌.. శుక్రుడు,బృహస్పతితో కలుస్తాడు. ఫిబ్రవరి నెల అనేక రాశిచక్ర గుర్తులకు అదృష్టం తలుపులు తెరుస్తుంది. ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఎక్కువ లాభం చేకూరుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

మేషం: మేష రాశి వారికి గ్రహాల మార్పు వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన డబ్బు చేతికి అందుతుంది. అంతే కాకుండా పెట్టిన పెట్టుబడి కూడా లాభిస్తుంది. తల్లిదండ్రులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. వారి సహాయంతో ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం. స్నేహితుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. శుక్ర రాశి మార్పుతో, మీరు సమస్యల నుండి విముక్తి పొందుతారు. భౌతిక సుఖాలను పొందుతారు. కానీ ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి.

కర్కాటక రాశి: నాలుగు గ్రహాల రాశి మార్పు కర్కాటక రాశి వారికి కూడా మేలు చేస్తుంది. మీరు కుటుంబం,పూర్వీకుల ఆస్తిని పొందుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో సమస్యలు పరిష్కరించబడతాయి. సూర్యుని ప్రభావం వల్ల సామాజిక కార్యక్రమాలలో సహకారంతో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఈ కాలం చాలా మంచిది. వృత్తిదారుల శ్రమ ప్రభావం కనిపించడంతో పాటు అధికారులు కూడా సానుకూలంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి : నాలుగు గ్రహాల సంచారం కన్యా రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో మతపరమైన పనులు చేసుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. ఏదైనా చట్టపరమైన వివాదం ఉంటే పరిష్కరింపబడుతుంది. బంధుమిత్రుల సహకారంతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఈ కాలం వ్యాపారులకు కూడా అనుకూలమైనది. కొత్త ఆర్డర్లు చేతికందుతాయి.

తుల : తులారాశి వారికి గ్రహ సంచారాలు చాలా మంచివి. జీవిత భాగస్వామి సహకారంతో అనుబంధం బలపడుతుంది. వ్యాపారంలో పురోభివృద్ధి, ధనలాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక స్థలాలను సందర్శిస్తారు. మీ పని పట్ల ప్రశంసలు, గౌరవం పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి.

కుంభం : ఫిబ్రవరి నెల కుంభ రాశి వారికి శుభప్రదం. ఈ రాశిలో సూర్యుడు , శుక్రుడు, బుధ గ్రహాలు ఉన్నాయి. ఇది జీవితంలో సానుకూలతను తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయి ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు, విహారయాత్రలకు వెళ్తారు. నిర్ణయాధికారం కూడా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..