AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: హమ్మయ్య.. షుగర్ పేషెంట్లకు గొప్ప శుభవార్త.. మధుమేహాన్ని నిరోధించే మెడిసిన్‌కు ఆమోదం..!

రక్తంలో చక్కెరను ఇతర కణాలకు తీసుకెళ్లడంలో ఇన్సులిన్ సహాయపడుతుంది. అప్పుడు అది శక్తిని తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. క్లినికల్ ట్రయల్ ఫలితాలు మధుమేహ నివారణకు మంచి మార్గాన్ని చూపించాయంటున్నారు వైద్య నిపుణులు.

Diabetes: హమ్మయ్య.. షుగర్ పేషెంట్లకు గొప్ప శుభవార్త.. మధుమేహాన్ని నిరోధించే మెడిసిన్‌కు ఆమోదం..!
Diabetes
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2023 | 12:37 PM

Share

మధుమేహ బాధితులకు ఇది గొప్ప శుభవార్తే.. ఎందుకంటే.. టైప్-1 డయాబెటిస్‌కు ఫస్ట్‌ ట్రయల్‌ చికిత్సకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఔషధాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రోవెన్‌బియో, సనోఫీ సంయుక్తంగా తయారు చేశారు. దాని పేరు Tzield. ఈ ఔషధం టైప్-1 మధుమేహాన్ని నివారిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మధుమేహం రాదని (Tzield) టీజీల్డ్‌ను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ పేర్కొంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ (USFDA) నవంబర్ 2022లో ఈ ప్రత్యేక ఔషధాన్ని ఆమోదించింది. టైప్-1 మధుమేహం స్వయం ప్రతిరక్షక ప్రతిచర్యగా పరిగణించబడుతుంది. ఈ ప్రతిచర్య ఇన్సులిన్‌ను తయారుచేసే ప్యాంక్రియాస్‌లోని కణాలను నాశనం చేస్తుంది. వీటిని బీటా కణాలు అంటారు. లక్షణాలు కనిపించడానికి ముందు ఈ ప్రక్రియ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు భిన్నంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రధానంగా జీవనశైలి కారణంగా కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది. ఇంతకు ముందు టైప్-1 డయాబెటిస్‌కు నివారణ చికిత్స లేదు.

అద్భుతంగా పరిగణించబడే ఈ ఔషధం మధుమేహం యొక్క దశ-2లో ఉన్న 8 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఆమోదించబడింది. అమెరికన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టైప్ -1 డయాబెటిస్‌కు ఇప్పటివరకు ఎటువంటి నివారణ చికిత్స లేదు. కనీసం ఇప్పుడు టైప్-1 మధుమేహాన్ని కొంత కాలం పాటు నివారించవచ్చు. క్లినికల్ ట్రయల్ ఫలితాలు మదుమేహ నివారణకు మంచి మార్గాన్ని చూపించాయంటున్నారు వైద్య నిపుణులు.

ఈ ఔషధం యొక్క ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. వాస్తవానికి, మధుమేహ బాధితులు ఇన్సులిన్ లేకుండా సాధారణ జీవితాన్ని గడపడం నిజంగా దేవుడిచ్చిన వరంగానే చెప్పాలని ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు అంటున్నారు. ఈ ఔషధం కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కొత్త ఆశాకిరణాన్ని రేకెత్తించిందని వారు అభిప్రాయపడ్డారు. ఇది వైద్య పరంగా మరో పెద్ద విజయంగా చెబుతున్నారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు మాత్రమే దీనిని అర్థం చేసుకోగలరు.

ఇవి కూడా చదవండి

Tzield మానవ శరీరం,స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందనతో జోక్యం చేసుకుంటుంది. ఈ వ్యాధిలో, రోగనిరోధక కణాలు ప్యాంక్రియాస్‌లో ఉత్పత్తి అయ్యే బీటా కణాలను నాశనం చేస్తాయి. ఈ రోగనిరోధక కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తాయి. రక్తంలో చక్కెరను ఇతర కణాలకు తీసుకెళ్లడంలో ఇన్సులిన్ సహాయపడుతుంది. అప్పుడు అది శక్తిని తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ట్రయల్స్‌లో Tzield రెండు సంవత్సరాలకు పైగా వ్యాధిని నివారించడంలో సహాయం చేస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మధుమేహాన్నినివారించవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?