Viral Video: మొసలితోనే గేమ్సా..? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్

ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలిని ఆటపట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతని ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో అతడు కుయ్యో, మొర్రో అంటూ గంగోలు పెట్టాల్సి వచ్చింది.

Viral Video: మొసలితోనే గేమ్సా..? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్
Crocodile
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2023 | 10:47 AM

భూమిపై చాలా ప్రమాదకరమైన జంతువులు నివసిస్తున్నాయి. వాటి నుండి ప్రజలు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. లేదంటే వాటితో ప్రాణాపాయాన్ని ఎదుర్కొక తప్పదు. సింహాలు, పులులు, చిరుతపులులు వంటి అడవి జంతువులు మానవులకు అత్యంత ప్రమాదకరం. అలాంటి వాటిళ్లో మొసళ్ళు కూడా తక్కువేమీ కాదు. మొసలి మనిషిపై దాడి చేసిందంటే..అతను తప్పించుకుని బతకడం ఇక కష్టమనే చెప్పాలి. ఇవి భూమిపై, నీటిలో రెండు చోట్ల నివసించగలిగే ప్రమాదకరమైన జంతు. ప్రస్తుతం మొసలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. వీడియో చాలా షాకింగ్‌గా ఉంది.. ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలిని ఆటపట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతని ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో అతడు కుయ్యో, మొర్రో అంటూ గంగోలు పెట్టాల్సి వచ్చింది.

ఒక మొసలి నేలపై విశ్రాంతి తీసుకుంటోంది. ఇది చూసిన వెంటనే ఆ వ్యక్తి మొసలి వీపుపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా మొసలి తిరగబడింది. టక్కున అతని చేతిని పట్టేసింది.. కానీ, అప్రమత్తమైన బాధితుడు.. వెంటనే అలర్టై.. మొసలి నోటికి చిక్కకుండా తప్పించుకున్నాడు. కానీ, మొసలి దాడిలో అతని చేతికి గాయం కావటంతో తీవ్ర రక్తస్త్రావమైంది.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన ఈ వీడియో animals_powers అనే IDతో వీడియో షేర్‌ చేయబడింది. ఇప్పటి వరకు ఈ వీడియోకి 2 లక్షల 27 వేల వ్యూస్‌ వచ్చాయి.. ఈ వీడియోను 7 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఇలాంటి క్రూర జంతువుల పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు.