ప్రియురాలితో గొడవ.. ఆగ్రహంతో రూ.70 లక్షల బెంజ్ కారును తగులబెట్టిన యువ డాక్టర్‌..

కానీ, అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు ధర్మపురి జిల్లాకు చెందిన గవిన్ అనే వ్యక్తికి చెందినదని తేలింది.

ప్రియురాలితో గొడవ.. ఆగ్రహంతో రూ.70 లక్షల బెంజ్ కారును తగులబెట్టిన యువ డాక్టర్‌..
Car Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2023 | 9:08 AM

ఇద్దరు ప్రేమికుల మధ్య వివాదం కార్చిచ్చుగా మారింది. ప్రియురాలిపై ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు.. ఖరీదైన కారును తగులబెట్టేశాడు. కాంచీపురం పక్కనే ఉన్న రాజకుళం ప్రాంతంలోని కులైకరై సమీపంలో బెంజ్ కారులో యువ జంట మాట్లాడుకుంటుండగా.. యువతీ , యువకుల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవ మొదలైంది. వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది.. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియుడు తన సొంత బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చెరువు సమీపంలో కారు కాలిపోతున్నట్లు గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు ధర్మపురి జిల్లాకు చెందిన గవిన్ అనే వ్యక్తికి చెందినదని తేలింది.

గావిన్ కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి గతేడాది పట్టభద్రుడయ్యాడు. ఈ సందర్భంలో అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థిని కావ్యతో ప్రేమలో పడ్డాడని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంచీపురం పక్కనే ఉన్న రజకులం ప్రాంతంలో ప్రియురాలితో మాట్లాడుతుండగా.. విబేధాలు రావడంతో ఆగ్రహించిన గావిన్.. 70 లక్షల రూపాయల విలువైన తన సొంత లగ్జరీ కారు (బెంజ్)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై కాంచీపురం తాలూకా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?