Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pariksha Pe Charcha: నేడు పరీక్షా పే చర్చా కార్యక్రమం.. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్న ప్రధాని మోదీ..

పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాలను, ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి...

Pariksha Pe Charcha: నేడు పరీక్షా పే చర్చా కార్యక్రమం.. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్న ప్రధాని మోదీ..
Pariksha Pe Charcha
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2023 | 8:59 AM

పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాలను, ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు ప్రధాని. ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో ఈ రోజు 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

పరీక్షలంటే విద్యార్థులకుండే భయం, ఒత్తిడిని ఎలా అధిగమించాలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్షణం. ఇందులో భాగంగా పాఠశాలల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. పరీక్షల పట్ల విద్యార్థులకు ఉండే భయం, ఒత్తిడిని ఎలా అధిగమించాలో అవగాహన కల్పిస్తారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక మనదేశానికి చెందిన 81వేల మందికి పైగా విద్యార్థులు, 11వేల మందికి పైగా ఉపాధ్యాయులు, 5వేల మందికి పైగా తల్లిదండ్రులు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

9 నుంచి 12 తరగతుల విద్యార్థులు, ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు పాల్గొనడానికి నమోదు చేసుకున్న తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోనూ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. సనత్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లలో ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..