AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? దివ్వౌషధం..!

గోరువెచ్చని నెయ్యిని పాలలో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడుతాయి. మీరు జలుబు మరియు ఫ్లూతో బాధపడుతున్నట్లయితే, పాలు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవడం మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

Health Tips: పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? దివ్వౌషధం..!
Milk Ghee
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2023 | 9:37 AM

Share

పాలు, నెయ్యి ప్రయోజనాలు: పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయిన మీకు తెలుసా..? పాలు, నెయ్యి మన ఆహారంలో ఎప్పటి నుంచో ఒక భాగంగా ఉంటున్నాయి.. పాలలోని పోషకాలు అన్ని వయసుల వారికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చెంచా నెయ్యిని ఒక గ్లాసు పాలలో కలుపుకుని రోజూ సేవిస్తే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆయుర్వేదంలో పాలు, నెయ్యి కలిపి తాగడాన్ని అమృతంగా పరిగణిస్తారు. గోరువెచ్చని నెయ్యిని పాలలో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడుతాయి. మీరు జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే, పాలు, నెయ్యి మిశ్రమం మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

పాలు – నెయ్యిలో లభించే పోషకాలు పాలలో కేలరీలు, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్-డి, విటమిన్-బి12, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. విటమిన్-ఎ, డి, కాల్షియం, ఫాస్పరస్, మినరల్స్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు నెయ్యిలో ఉంటాయి. గోరువెచ్చని నెయ్యిని పాలలో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడుతాయి. మీరు జలుబు మరియు ఫ్లూతో బాధపడుతున్నట్లయితే, పాలు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవడం మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

జీర్ణక్రియ కోసం.. పాలు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో పాటు, ఇందులో ఉండే ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

బాగా నిద్రపోవడానికి.. పాలలో ప్రోటీన్లతో పాటు, ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీరంలోకి చేరుకుని సెరోటోనిన్గా మారుతుంది. ఇది మన శరీరానికి విశ్రాంతినిస్తుంది. తద్వారా మనకు మంచి నిద్ర వస్తుంది.

గర్భధారణ సమయంలో.. గర్భం దాల్చిన సమయంలో మహిళలు నెయ్యి పాలలో కలిపి తాగడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ఇలా చేసే ముందు ఒకసారి వైద్యుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.. నెయ్యి, పాలు రెండూ సహజమైన మాయిశ్చరైజర్లు, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్