AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Facts: ఫుల్లుగా తాగిన మందుబాబులు ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడతారో తెలుసా..? శాస్త్రవేత్తల పరిశోధనలో..

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ విషయంపై మరిన్నిపరిశోధనలు జరుగుతున్నాయని, ఆ తర్వాత మాత్రమే తుది ఫలితం వెల్లడవుతుందని చెప్పారు.

Alcohol Facts: ఫుల్లుగా తాగిన మందుబాబులు ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడతారో తెలుసా..? శాస్త్రవేత్తల పరిశోధనలో..
Alcohol Facts
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2023 | 6:46 AM

Share

మద్యం సేవించి మత్తులో రకరకాల డ్రామాలు చేసే వ్యక్తులను మీరు చూసే ఉంటారు. కొందరు తాగుబోతులు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. కొందరు తమ మనసులోని రహస్యాలన్నింటినీ బయటపెడతారు. తాగుబోతులు ఎప్పుడూ నిజమే మాట్లాడతారని కూడా అంటారు. అయితే తాగుబోతులు సత్యమే కాకుండా ఇంగ్లీషులో కూడా మాట్లాడటం మీరు గమనించారా..? ఒక్కోసారి తాగుబోతుల ఇంగ్లీష్‌ వింటే నవ్వకుండా ఉండలేరు. నిజానికి, మత్తులో ఉన్న స్థితిలో, ఒక వ్యక్తిలో భాష పట్ల భయం బాగా తగ్గిపోతుంది. దీంతో పాటు ఎదుటివారు ఏమనుకుంటారో..అని కూడా ఆలోచించరు. అందుకే తాగుబోతులు ఎవరైనా సరే సులభంగా వివిధ భాషలను మాట్లాడటం ప్రారంభించటానికి ఇదే కారణం. వివిధ అధ్యయనాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు.. ఈ అధ్యయనం సైకోఫార్మకాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది. యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్, మాస్ట్రిక్ట్ యూనివర్శిటీ మరియు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. మద్యం సేవించిన తర్వాత రెండో భాష మాట్లాడే సామర్థ్యం మెరుగవుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. మద్యం సేవించిన తర్వాత పరాయి భాష మాట్లాడతారని స్పష్టం చేశారు. రెండు భాషలపై అవగాహన ఉన్న 50 మందిని ఈ పరిశోధనలో చేర్చారు. ఈ వ్యక్తులందరికీ తాగడానికి మద్యం ఇచ్చారు. ఆ తర్వాత మద్యం తాగిన వ్యక్తి ఇంగ్లీష్ బాగా మాట్లాడాడు. కానీ, అతనికి మద్యానికి ముందు ఇంగ్లీష్‌ భాష రాదు.

కొద్దిగా ఆల్కహాల్ మీ ఉచ్చారణను మెరుగుపరుస్తుందని ఈ పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. దీనితో పాటు, మీ ఆందోళన కూడా తగ్గుతుందని, మద్యం ఎక్కువగా తాగే వ్యక్తి మాట్లాడలేని పరిస్థితి ఏర్పాడుతుందన్నారు. అయితే, ఇది కూడా తుది ఫలితంగా పరిగణించబడదు. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ విషయంపై మరిన్నిపరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత మాత్రమే తుది ఫలితం వెల్లడవుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..