- Telugu News Photo Gallery Spending over time under WIFI can cause health complications and problems check here for details
Wi-Fi: ఎక్కువ సమయం వైఫై వాడినా ఆరోగ్య సమస్యలు తప్పవు.. అతిగా ఇంటర్నెట్‌ను వాడితే కలిగే దుష్ప్రభావాలివే..
Wi-Fi: వైఫై ఉంది కదా అని అతిగా వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు, చిక్కులు తప్పవు. వైఫై కింద అలా పడి కూర్చుని ఫోన్ లేదా లాప్‌టాప్ వాడుతూ ఉండడం వల్ల శారీరక శ్రమ లోపించి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Updated on: Jan 26, 2023 | 9:28 PM

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా అన్ని రంగాల్లోనే ఊహించని మార్పులను వచ్చాయి.. అద్భుత ఆవిష్కరణలు ఆశ్చర్య పరుస్తున్నాయి. కమ్యూనికేషన్ సిస్టమ్, టెక్నాలజీ అభివృద్ధితో ప్రజల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇంతకముందు కొన్ని రకాల పనులు చేయాలంటే గంటలు, రోజులు వెచ్చించాల్సి వచ్చేది.

ఆ పనులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల జరిగిన అంశమైనా క్షణాల్లో అందరికీ చేరువవుతుంది. ఏ దేశంలోని వారితోనైనా సులువుగా కమ్యూనికేట్ అయ్యే అవకాశం కలిగింది. టెక్నాలజీ లేని మానవుని జీవితం ఊహించడం కష్టంగా మారింది. ఇంతలా ప్రజల జీవితాల్లో భాగమైపోయిన టెక్నాలజీ మితిమీరిన వినియోగంతో సమస్యలు పొంచి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచం వేగంగా టెక్నీఫైడ్ అవుతున్న తరుణంలో ప్రస్తుతం ఇండియాలో 5G లాంచ్ కూడా అయింది. ఇంటర్నెట్ మెరుగైన కనెక్టివిటీ ద్వారా నిరంతరాయంగా ఎంటర్‌ట్రైన్‌మెంట్ పొందే అవకాశం ప్రజలకు కలిగిస్తోంది. అయితే ఇలా కంటిన్యూగా ఇంటర్నెట్ వినియోగించడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. Wi-Fi, మొబైల్‌ని నిరంతరం ఉపయోగించడం, వాటి పరిధిలో ఎక్కువ సమయం ఉండటం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

Wi-Fi వేవ్స్, ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించే వారిలో నిద్రలేమి సమస్య కనిపిస్తోంది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను ఎక్కువ సేపు ఉపయోగిస్తే కంటి చూపుపై ప్రభావం కనిపిస్తుంది. ఎక్కవ సేపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ చూడటం వల్ల కళ్లలో మంటలు వస్తాయి. కొన్నిసార్లు కంటి వాపు సమస్య కూడా ఎదురవుతుంది.

గంటల తరబడి కంప్యూటర్, మొబైల్‌లో ఇంటర్నెట్ వినియోగించడం ద్వారా ఆటోమేటిక్‌గా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీని వల్ల ఊబకాయం సమస్య పెరుగుతోంది. Wi-Fi వేవ్స్ మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఇంటర్నెట్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎక్కువగా చిరాకు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి అసహనం వ్యక్తం చేస్తుంటారు.

ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రజల జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం కనిపిస్తోంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్యలు వస్తున్నాయి. చాలా మంది విషయాలను గుర్తుపెట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

రాత్రి నిద్రపోతున్నప్పుడు wi-fiని ఆఫ్ చేయాలి. నిద్ర పోయే ముందు మొబైల్ వినియోగించకూడదు. రోజులో ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ప్రయత్నించాలి. బయటి ఆటలు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.





























