టెక్ మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. రూ. 7వేల లోపు అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..
Jan 26, 2023 | 9:48 PM
హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ టెక్నో తాజాగా బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ గో పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 25 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ రావడం విశేషం.
1 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.6,999గా ఉంది. 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 4జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
2 / 5
ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూనెబ్యులా పర్పుల్ కలర్స్‌లో విడుదల చేశారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.56- అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.
3 / 5
మీడియాటెక్ హీలియో ఏ22 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 హెచ్‌ఐఓఎస్ 12.0 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 5000 ఎంఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు.
4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో రియర్ డ్యూయల్ కెమెరాను అందించారు. f/1.85 ఎపర్చర్‌తో 13ఎంపీ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.