Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine: మైగ్రేన్‌ను తక్షణమే నయం చేసే హోం రెమెడీ ఇదిగో!

గరిష్ట తీవ్రతకు చేరుకుంటుంది. తల తిరగడం,. కొన్నిసార్లు వికారం, వాంతులు కూడా అవుతుంటాయి. అయితే, ఇవి కొంత విశ్రాంతి, మంచి నిద్రతో వాటంతట అవే తగ్గిపోయే అవకాశం ఉంది.

Migraine: మైగ్రేన్‌ను తక్షణమే నయం చేసే హోం రెమెడీ ఇదిగో!
Migraine Pain
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 26, 2023 | 1:30 PM

ప్రస్తుత ఒత్తిడి కాలంలో మైగ్రేన్‌లు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. మైగ్రేన్‌ బాధ మామూలుగా ఉండదంటారు బాధితులు. అయితే, కొందరు వ్యక్తులు మైగ్రేన్‌లను సాధారణ తలనొప్పిగా భావిస్తారు. చికిత్స కోసం వైద్య సలహా తీసుకోరు. కానీ, ఇలా చేయటం ఇది పూర్తిగా తప్పు అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. మైగ్రేన్‌లను వదిలించుకోవడానికి చాలా శ్రద్ధ, ఓపిక అవసరం. అలాగే, ఇది ఇంటి నివారణల చర్యలతో సులభంగా నయం చేసుకోవచ్చంటున్నారు. అయితే, మైగ్రేన్ అనేది నుదిటికి ఒక వైపు మాత్రమే వచ్చే నొప్పి. మెల్లగా మొదలయ్యే థ్రోబింగ్ సెన్సేషన్. మెల్లి మెల్లిగా ఈ నొప్పి పెరుగుతుంది. గరిష్ట తీవ్రతకు చేరుకుంటుంది. తల తిరగడం,. కొన్నిసార్లు వికారం, వాంతులు కూడా అవుతుంటాయి. అయితే, ఇవి కొంత విశ్రాంతి, మంచి నిద్రతో వాటంతట అవే తగ్గిపోయే అవకాశం ఉంది.

మైగ్రేన్‌కు కారణం.. పర్యావరణ, జన్యుపరమైన కారకాలు రెండూ పార్శ్వపు నొప్పికి అత్యంత ముఖ్యమైన కారణాలుగా పరిగణించబడతాయి. కాబట్టి, వీలైనంత వరకు, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మనకు ఆందోళన, ఒత్తిడి అనిపించిన వెంటనే మనం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే, మీరు మైగ్రేన్‌తో బాధపడాల్సి ఉంటుంది.

ఇంటి నివారణలు.. మైగ్రేన్‌లకు ఉత్తమమైన ఇంటి నివారణలలో అల్లం ఒకటి. అల్లంలో నీరు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి12, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఉన్నాయి. అల్లంలో సోడియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, చక్కెర నియంత్రణ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మైగ్రేన్‌లను అల్లం ఎలా నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

రెసిపీ.. ముందుగా అల్లం పై తొక్కను బాగా అరగదీయాలి.. దీనికి కొద్దిగా నీరు పోసి బాగా కలపాలి. చిక్కటి పేస్ట్‌లా తయారైన తర్వాత..మైగ్రేన్ ప్రాంతంలో అప్లై చేయాలి. మైగ్రేన్‌ పూర్తిగా నయమవుతుంది. తలనొప్పి తగ్గకుండా పెరుగుతూ ఉంటే అల్లంను బాగా గ్రైండ్ చేసి అల్లం పేస్టును తలకు పట్టించాలి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..