Saffron Tea: పుత్తడితో తులతూగే కుంకుమపువ్వు .. అందం, ఆరోగ్యాన్నిచ్చే కేసరీ టీ తయారీ.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం
పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం. కుంకుమపువ్వు తో తయారు చేసిన టీ తాగడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో కాశ్మీర్ లో మాత్రమే పండుతుంది. ఇక్కడ పండే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదిగా ప్రసిద్ధిగాంచింది. మన వంటల్లో కుంకుమ పువ్వు విరివిగా కనిపిస్తుంది. ఇది వంటలకు చక్కని రుచి, వాసన ఇస్తుంది. కుంకుమ పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి.ఆయుర్వేదంలో కుంకుమ పువ్వుకు విశిష్ట స్థానం ఉంది. ఇది వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటారు. పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి.
అంతేకాదు మనదేశంలోని గర్భిణులకు పెద్దలు కుంకుమపువ్వు కలిపిన పాలు ఇస్తారు. ఇలా తాగితే పిల్లలు తెల్లగా పుడతారని నమ్మకం. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. ఏది ఏమైనా రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే ఇది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం. కుంకుమపువ్వు తో తయారు చేసిన టీ తాగడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కుంకుమపువ్వు టీ అత్యుత్తమం. ఈరోజు కేసరీ టీ తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:




కుంకుమ పువ్వు
పుదీనా
అల్లం
నిమ్మ రసం
తేనే
నీరు
కేసరీ టీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల నీరు పోయండి. అందులో మూడు కుంకుమ పువ్వులు వేసి ఉడికించాలి. అనంతరం పుదీనా ఆకులు, అల్లం వేసి మరిగించండి. నీరు మరిగిన అనంతరం.. రుచి కోసం నిమ్మరసం, తేనెను జోడించండి.. అంతే టేస్టీ టేస్టీ కేసరీ టీ రెడీ.
కుంకుమపువ్వు టీ వలన ఆరోగ్య ప్రయోజనాలు
కుంకుమపువ్వు లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్ ఉంటాయి.
ఒత్తిడి నుంచి ఉపశమనం:
మానసికంగా ఒత్తిడితో ఉన్నప్పుడు.. లేదా టెన్షన్‌గా ఉన్నప్పుడు ఒక కప్పు కుంకుమపువ్వు టీ తాగండి. వెంటనే మీ ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదే అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. రోజూ 30 మిల్లీగ్రాముల కుంకుమపువ్వు తీసుకోవడం లేదా కుంకుమపువ్వు టీ తాగడం వల్ల అల్జీమర్స్ రోగుల పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు యాంటిడిప్రెసెంట్ లక్షణాలు ఒత్తిడి లేదా డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం:
కుంకుమపువ్వు టీ మహిళలకు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. కనుక రుతుక్రమ సమయంలో ఒక కప్పు వేడి కుంకుమపువ్వు టీ నొప్పిని తగ్గించడమే కాదు.. శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను నియంత్రిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే టీ:
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప రుస్తుంది. అంతేకాదు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)