Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweatpants Day: వంద ఏళ్ల చరిత్ర ఉన్న స్వెట్‌ప్యాంట్స్ .. ఎప్పుడు ఎలా ట్రెండ్‌లోకి వచ్చిందో తెలుసా

స్వెట్‌ప్యాంట్ ఇది చెమట ప్యాంటు రెండు పదాలతో రూపొందించబడింది. ఇది చెమటను గ్రహించగల ప్యాంటు. మొదట్లో దీనిని వేసవి కాలంలో ధరించడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమంలో వేసవి కాలానికే కాకుండా వింటర్ సీజన్ కు కూడా డిజైన్ చేయడం ప్రారంభించారు.

Sweatpants Day: వంద ఏళ్ల చరిత్ర ఉన్న స్వెట్‌ప్యాంట్స్ .. ఎప్పుడు ఎలా ట్రెండ్‌లోకి వచ్చిందో తెలుసా
Sweatpants 2023
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2023 | 6:57 PM

నేటి తరం యువత చౌకైన, అందమైన, మన్నికైన దుస్తులను కోరుకుంటారు. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఫ్యాషన్ గా ఉండే   సౌకర్యవంతమైన బట్టలు అవసరం. నేటి తరం యువతీ యువకుల మనసు దోచుకుంది జీన్స్ ప్యాంట్. ఇందులో అనేక రకాలున్నాయి. మార్నింగ్ వాక్‌కి వెళ్లాలన్నా, షాపింగ్‌కి వెళ్లాలన్నా, ప్లేగ్రౌండ్‌కి వెళ్లాలన్నా, రైలులో ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా..  ఈ ప్రదేశాలన్నింటికీ ఒకే డ్రెస్ ప్రసిద్ధి చెందింది.. స్వెట్‌ప్యాంట్. స్వెట్‌ప్యాంట్ ఇది చెమట ప్యాంటు రెండు పదాలతో రూపొందించబడింది. ఇది చెమటను గ్రహించగల ప్యాంటు. మొదట్లో దీనిని వేసవి కాలంలో ధరించడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమంలో వేసవి కాలానికే కాకుండా వింటర్ సీజన్ కు కూడా డిజైన్ చేయడం ప్రారంభించారు.

అంతర్జాతీయ స్వెట్ ప్యాంట్స్ డే అంతర్జాతీయ స్వెట్‌ప్యాంట్స్ డే ప్రతి సంవత్సరం జనవరి 21 న జరుపుకుంటారు. అయితే స్వెట్‌ప్యాంట్ కు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని మీకు తెలుసా.. స్వెట్‌ప్యాంట్లు ..  ట్రౌజర్‌లలో ఒక రకం. చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా క్రీడారంగంలో స్వెట్‌ప్యాంట్స్  అత్యంత ప్రజాదరణ పొందిన దుస్తులు. అథ్లెట్లు ఎక్కువగా వీటిని ధరిస్తారు.

స్వెట్‌ప్యాంట్స్ చరిత్ర

ఇవి కూడా చదవండి

స్వెట్‌ప్యాంట్స్  చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్యాంట్స్ ను 1882లో ఫ్రెంచ్ దుస్తులు, పాదరక్షలు, క్రీడా పరికరాల కంపెనీ అయిన Le Coq Sportif  తయారు చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత.. 1920లో ఎమిలే కాముసెట్ అథ్లెట్ల కోసం స్వెట్ ప్యాంట్‌లను రూపొందించారు. ఈ స్వెట్‌ప్యాంట్లు నో-ఫ్రిల్స్, గ్రే నిట్ జెర్సీ ప్యాంట్‌తో తయారు చేయబడ్డాయి.

ప్రజాదరణ పొందింది 1926లో.. అమెరికా దుస్తుల తయారీదారు కంపెనీ రస్సెల్ అథ్లెటిక్ ఉన్ని జెర్సీ..  మృదువైన, సౌకర్యవంతమైన స్వెట్‌ప్యాంట్‌లను తయారు చేసింది. అయితే ఒక దశాబ్దం తర్వాత  మంచి ప్రాచుర్యం పొందింది. అయితే, 1950లలో స్వెట్‌ప్యాంట్‌లకు ఆదరణ తగ్గింది. ఇది గౌరవప్రదమైన దుస్తులుగా అంగీకరించబడలేదు. ఎక్కువగా జిమ్‌లు, యూనివర్సిటీ క్యాంపస్‌లకే పరిమితమైంది.

60వ దశకంలో కీర్తి 1960లు, 1970లలో స్వెట్‌ప్యాంట్‌లు మళ్ళీ ఫ్యాషన్ రంగంలో అడుగు పెట్టాయి. ఆమోదం పొందాయి. అథ్లెట్లు వీటిని ఆదరించారు.  1980లలో హిప్-హాప్ సంగీతకళాకారులు ఆదరించారు. ర్యాప్ స్టార్లు తమ ప్రత్యేక డ్రెస్‌గా దీన్ని ఎంచుకున్నారు. ఈ స్వెట్‌ప్యాంట్స్ ను  ధరించి వీధుల్లోకి వచ్చారు. యువతను ఆకట్టుకున్నారు.

21వ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. సోషల్ మీడియా స్వెట్‌ప్యాంట్‌లను అథ్లెటిక్ వేర్‌గా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు  స్వెట్‌ప్యాంట్స్ కు క్లాసిక్ లుక్ ఇచ్చారు అంతేకాదు ఫిట్ నెస్, మోడ్రన్ ట్రెండ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానికి క్యాజువల్ నెస్ తోడైంది.  దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్వెట్‌ప్యాంట్స్ డిజైన్లలో కొత్తదనం వస్తూనే ఉంది. ఆరోజు రోజుకీ మరింత ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..