AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: అనంత్ మళ్లీ బరువు పెరగడానికి కారణమిదే.. ఆసక్తికర విషయాలు పంచుకున్న నీతా అంబానీ

ఈ ఫొటోల్లో అనంత్‌ అంబానీ భారీ కాయంతో కనిపించారు. గతంలో భారీగా బరువు తగ్గి నాజుగ్గా మారిన అనంత్ మళ్లీ బరువు పెరగడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

Anant Ambani: అనంత్ మళ్లీ బరువు పెరగడానికి కారణమిదే..  ఆసక్తికర విషయాలు పంచుకున్న నీతా అంబానీ
Anant Ambani
Basha Shek
|

Updated on: Jan 26, 2023 | 1:42 PM

Share

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ- నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. రాధిక మర్చంట్‌తో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగపెట్టనున్నారు. అనంత్- రాధికల నిశ్చితార్థం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలయ్యాయి. కాగా ఈ ఫొటోల్లో అనంత్‌ అంబానీ భారీ కాయంతో కనిపించారు. గతంలో భారీగా బరువు తగ్గి నాజుగ్గా మారిన అనంత్ మళ్లీ బరువు పెరగడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ కూడా వచ్చాయి. .ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కొనలేమంటూ కొందరు నెటిజన్లు అనంత్‌ అంబానీ ఫొటోలపై కామెంట్లు పెడుతున్నారు. అయితే 2016లో 200 కిలోల నుంచి 100 కిలోల వరకు తగ్గిన అనంత్ అంబానీ మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై తల్లి నీతా అంబానీ స్పందించారు. గతంలో 100 కిలోల వరకు బరువు తగ్గి చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచాడు అనంత్. అయితే నా కుమారుడు కొన్ని తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు. వీటి దుష్ప్రభావాల కారణంగానే అనంత్‌ మళ్లీ బరువు పెరిగాడు’

‘అనంత్‌ ప్రతి రోజూ 5-6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు. నా కుమారుడిలాగా ఊబకాయంతో పోరాడుతున్న వారు మనచుట్టూ చాలామందే ఉంటారు. దయచేసి అలాంటివారిని చిన్నచూపు చూడకండి. వారు మరింత మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. వీటికి బదులు బరువు తగ్గేందుకు మంచి సలహాలు, సూచనలు అందించండి’ అని స్ఫూర్తి నింపారు నీతా అంబానీ. కాగా ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులకు వైద్యులు స్టెరాయిడ్స్ ను సూచిస్తారు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా, శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. అయితే స్టెరాయిడ్స్ కారణంగా విపరీతమైన ఆకలి కలుగుతుంది. దీనికి ఆస్థమా సమస్య ఉన్న వారు శారీరక వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది. క్రమంగా ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..