RRR: ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్‌.. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఘనంగా సన్మానించిన బండి సంజయ్‌

నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ నామినేషన్ నిలవడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సింగర్‌ రాహుల్‌ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌కు స్వీట్స్‌ తినిపించి పూలగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు బండి సంజయ్‌.

RRR: ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్‌.. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఘనంగా సన్మానించిన బండి సంజయ్‌
Bandi Sanjay, Rahul
Follow us
Basha Shek

|

Updated on: Jan 25, 2023 | 1:32 PM

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం అవార్డులు కొల్లగొడుతోంది. తాజాగా సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ ఫైనల్స్‌కు నామినేట్‌ అయ్యింది. ఈక్రమంలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారానికి నామినేట్‌ అయిన తొలి సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. తెలుగు సినిమాకు ఇది గర్వకారణమంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కీరవాణి స్వరాలు సమకూర్చిన నాటు నాటు పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కాలభైరవ-రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ఈ క్రమంలో నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ నామినేషన్ నిలవడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సింగర్‌ రాహుల్‌ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌కు స్వీట్స్‌ తినిపించి పూలగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు బండి సంజయ్‌. ఈ సందర్భంగా బీజేపీ అధ్యకుడి విజ్ఞప్తి మేరకు నాటు నాటు పాట ఆలపించాడు రాహుల్. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి అభినందనలు తెలిపారు బండి సంజయ్‌. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

‘తన ట్యాలెంట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి ఆస్కార్ బరిలో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌ను కలిశాను. ఈ అద్భుత గడియలను రాహుల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. మన హైదరాబాదీ కుర్రాడు పాడిన పాట వరల్డ్ ఫేమస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు నా అభినందనలు. ఇంకా మరెన్నో అంతర్జాతీయ అవార్డులు గెలవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు బండి సంజయ్‌. కాగా ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించింది. క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది నాటు నాటు పాట. ఆస్కార్‌ తొలిమెట్టుకి చేరిన నాటు నాటు పాట సక్సెస్‌తో ఆస్కార్‌ నామినేషన్స్‌పై ట్రిపుల్‌ ఆర్‌ యూనిట్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్తూ ప్రముఖుల ట్వీట్లు చేశారు. సోషల్‌ మీడియాలో కురుస్తోన్న ప్రశంసల జల్లులో చిత్ర బృందం తడిసి ముద్దవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు