- Telugu News Photo Gallery Cricket photos KLRahul Athiya Shetty Wedding Photos Goes Viral In social Media
KLRahul-Athiya Shetty: రెండు కళ్లు చాలట్లేదుగా.. కేఎల్ రాహుల్- అతియాల పెళ్లి ఫొటోలు చూశారా?
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అథియా శెట్టి కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. సోమవారం (జనవరి 23) ఖండాలాలోని నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
Updated on: Jan 24, 2023 | 5:55 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అథియా శెట్టి కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. సోమవారం (జనవరి 23) ఖండాలాలోని నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహా వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అలాగే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ లవ్లీ కపుల్ పెళ్లిలో సందడి చేశారు.

పెళ్లి తర్వాత ముంబైలో రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నట్లు అతియా తండ్రి సునీల్ శెట్టి తెలిపారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియాతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడు కేఎల్ రాహుల్. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారీ లవ్ బర్డ్స్.

తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రాహుల్- అతియా. దీంతో ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా పెళ్లి వేడుక కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ద్వారా తిరిగి జట్టులోకి రానున్నాడు.





























