ODI Cricket: టీ20, టెస్టుల్లో అదరగొట్టినా.. వన్డే కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలే.. లిస్టులో ముగ్గురు ఆటగాళ్లు..

వన్డే క్రికెట్ గురించి మాట్లాడితే, ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో సచిన్ పేరుపై 49 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం వన్డేల్లో 46 సెంచరీలు చేశాడు.

Venkata Chari

|

Updated on: Jan 24, 2023 | 12:00 PM

ప్రస్తుత రోజుల్లో వన్డే క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత కష్టం కాదనే సంగతి తెలిసిందే. సెంచరీరే కాదు.. కొంతమంది ప్లేయర్లు డబుల్ సెంచరీలు కూడా బాదేస్తున్నారు. మైదానం పరిమాణం చిన్నగా ఉండడం, పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడం, పవర్‌ప్లేల వల్ల బ్యాటింగ్ ఎంతో సులభంగా మారింది. అయితే, 90వ దశకంలో వన్డేల్లో 50-60 స్ట్రైక్ రేట్ కూడా మంచిదని భావించేవారు. అయితే ప్రస్తుతం బ్యాట్స్‌మెన్స్ టెస్ట్ క్రికెట్‌లో ఇదే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తుండడం మనం చూడొచ్చు.

1 / 5
వన్డే క్రికెట్ గురించి మాట్లాడితే, ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో సచిన్ పేరుపై 49 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం వన్డేల్లో 46 సెంచరీలు చేశాడు. కొంతమంది బ్యాట్స్‌మెన్ వన్డేల్లో సెంచరీలతో పాటు డబుల్ సెంచరీలు చేసి, సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంచితే, కొంతమంది దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఈ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయారు. అవును. మీరు చదివింది నిజమే. వన్డే కెరీర్‌లో సెంచరీ చేయలేని స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
డ్వేన్ స్మిత్: వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ డ్వేన్ స్మిత్ టీ20లో నిష్ణాతుడైన ఆటగాడు. టీ20 క్రికెట్‌లో 7000కు పైగా పరుగులు చేసినప్పటికీ వన్డే క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 100 వన్డేలకు పైగా ఆడినా, ఈ ఫార్మాట్‌లో స్మిత్‌ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. వన్డే క్రికెట్‌లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 97. అదే టీ20 క్రికెట్ గురించి మాట్లాడితే, అతను ఈ ఫార్మాట్‌లో 5 సెంచరీలను కలిగి ఉన్నాడు. అతను ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడి సెంచరీలు సాధించాడు.

3 / 5
ఆల్విన్ కాళీచరణ్: వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఆల్విన్ కళీచరణ్ టెస్టు క్రికెట్‌లో 12 సెంచరీలు సాధించాడు. కానీ, వన్డే క్రికెట్‌లో మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను తన వన్డే కెరీర్‌లో 31 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 6 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేలలో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 78. ఇది ఆస్ట్రేలియాపై చేశాడు.

4 / 5
మిస్బా-ఉల్-హక్: పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మెన్ మిస్బా-ఉల్-హక్ దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే అతను వన్డే క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. మిస్బా టెస్ట్ క్రికెట్‌లో తన కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. టెస్టులతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో మిస్బా ప్రదర్శన అంత గొప్పగా లేదు. 162 వన్డేలు ఆడినప్పటికీ మిస్బా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అతను ఈ ఫార్మాట్‌లో 42 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 96 (నాటౌట్).

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ