- Telugu News Photo Gallery Cricket photos ILT20: Dubai Capitals beat Mumbai Emirates by 16 runs in a high scoring game
ఇదేం మాస్ బ్యాటింగ్‌రా అయ్యా.. టీ 20 మ్యాచ్‌లో ఏకంగా 428 రన్స్.. 26 ఫోర్లు, 28 సిక్సర్లతో రికార్డులు బద్దలు
ఆదివారం (జనవరి 22) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో విరవిహారం చేశారు. దీంతో ఏకంగా 428 పరుగులు నమోదయ్యాయి. ఇందులో 26 ఫోర్లు, 28 సిక్సర్లు ఉన్నాయి.
Updated on: Jan 23, 2023 | 7:51 AM

ఆదివారం (జనవరి 22) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో విరవిహారం చేశారు. దీంతో ఏకంగా 428 పరుగులు నమోదయ్యాయి. ఇందులో 26 ఫోర్లు, 28 సిక్సర్లు ఉన్నాయి.

ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోవ్‌మన్ పావెల్ కేవలం 41 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 97 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆతర్వాత ముంబై ఎమిరేట్స్ కూడా తుదికంటా పోరాడింది. కెప్టెన్ పొలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. అయితే జట్టును ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయాడు.

పొలార్డ్ మాత్రమే కాదు, ఎమిరేట్స్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్ పెను విధ్వంసం సృష్టించాడు . ఐదు వరుస బంతుల్లో 6,4,6,6,6 స్కోర్‌లతో ఒకే ఓవర్‌లో 29 పరుగులు చేశాడు. జద్రాన్ 9 బంతుల్లో 30 పరుగులు చేసి అవుటైన వెంటనే ఎమిరేట్స్ ఓటమి ఖరారైంది.

లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు మాత్రమే చేయగలగడంతో 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రోవ్‌మన్ పావెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.





























