Waltair Veerayya: బాక్సాఫీస్‌ రికార్డుల దుమ్ము దులుపుతోన్న మెగాస్టార్‌.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి వాల్తేరు వీరయ్య

విడుదలైన తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వాల్తేరు వీరయ్య సినిమా తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

Waltair Veerayya: బాక్సాఫీస్‌ రికార్డుల దుమ్ము దులుపుతోన్న మెగాస్టార్‌.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి వాల్తేరు వీరయ్య
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2023 | 6:10 AM

మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. సంక్రాంతి (జనవరి 13) కానుకగా విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వాల్తేరు వీరయ్య సినిమా తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమాలోని మెగాస్టార్‌ కొత్త పోస్టర్‌కు కూడా రిలీజ్‌ చేసింది. కాగా వాల్తేరు వీరయ్య రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిరంజీవి మూడో సినిమా. అంతకు ముందు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. మరోవైపు యూఎస్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటివరకు 2.25 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు ఈ సినిమాను అమెరికాలో విడుదల చేసిన శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్‌ చేసింది.

బాబీ (కే.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమా భారీ సక్సెస్‌ సాధించడానికి రవితేజ కూడా ఒక కారణం. మెగాస్టార్‌- మాస్‌ మహారాజా కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ఇక శ్రుతిహాసన్‌ అంద చందాలు, క్యాథరిన్‌ థెరిస్సా అభినయం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ ఛార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..