AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandhya: పెళ్లి తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన ఈ ట్రెండ్‌ సెట్టర్‌ లవ్‌స్టోరీలో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు. హీరోయిన్‌గా సంధ్యకు ఇదే మొదటి సినిమా. అయిన తన అభినయంతో అందరినీ కట్టిపడేసిందీ అందాల తార.

Sandhya: పెళ్లి తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Actress Sandhya
Basha Shek
|

Updated on: Jan 23, 2023 | 6:10 AM

Share

2004లో విడుదలైన ప్రేమిస్తే సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఓ సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ విషాద ప్రేమకథకు ఇప్పటికీ ఫ్యాన్స్‌ ఉన్నారు. బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన ఈ ట్రెండ్‌ సెట్టర్‌ లవ్‌స్టోరీలో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు. హీరోయిన్‌గా సంధ్యకు ఇదే మొదటి సినిమా. అయిన తన అభినయంతో అందరినీ కట్టిపడేసిందీ అందాల తార. ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ,మలయాళం భాషల్లో కూడా వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ కలుపుకొని సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించింది సంధ్య. ఇక తెలుగులో కూడా పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అన్నవరం  సినిమా లో  చెల్లెలి పాత్రను పోషించింది. అందులో వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎంతో న్యాచురల్‌గా నటించి మెప్పించింది. అయితే ఆ తర్వాత సక్సెస్‌ను కొనసాగించలేకపోయింది. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. 2015 లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంధ్య. ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో చాలా సింపుల్ గా ఈ వివాహం వేడుక జరిగింది.

కాగా సంధ్య సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే 2016 సెప్టెంబర్‌లో సంధ్య దంపతులకు ఒక పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివాసముంటోంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తోందీ అందాల తార. ఇక ఈ మధ్య కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటికే కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడి చిత్రంలో హీరోయిన్ అక్క పాత్ర పోషించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందట.

ఇవి కూడా చదవండి

Actress Sandhya

Actress Sandhya

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..