AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Kamaraju: హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ప్రముఖ నటుడు.. పొద్దు పొద్దున్నే ఆ పని చేస్తూ..

కమల్‌ కామరాజు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. పొద్దు పొద్దున్నే పోలీసులకు దొరికపోయానంటూ వార్తల్లో నిలిచాడు.

Kamal Kamaraju: హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ప్రముఖ నటుడు.. పొద్దు పొద్దున్నే ఆ పని చేస్తూ..
Kamal Kamaraju
Basha Shek
|

Updated on: Jan 22, 2023 | 6:10 AM

Share

శేఖర్‌ కమ్ముల నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఆవకాయ్‌ బిర్యానీ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కమల్‌ కామరాజు. అనుకోకుండా ఒకరోజు, ఛత్రపతి, గోదావరి, జల్సా, అరవింద్‌2, కాటమరాయుడు, అర్జున్‌ రెడ్డి, మహర్షి, వకీల్ సాబ్‌ తదితర సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు. తానొక సెలబ్రిటీ అయినా సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంటాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చడు. సోషల్ మీడియాలోనూ చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ మాత్రమే ఇస్తుంటారు. అలాంటి కమల్‌ కామరాజు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. పొద్దు పొద్దున్నే పోలీసులకు దొరికపోయానంటూ వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు అతను పోలీసులకు దొరకడం ఏంటీ? ఏం నేరం చేశాడు? అని కొద్దిసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు విషయం ఏంటంటే.. బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌తో వెళుతూ హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోయారు. అదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నారు.

థ్యాంక్స్‌ టు హైదరాబాద్‌ పోలీస్‌..

‘అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు, అడ్వాన్స్‌ టెక్నాలజీ చూసి నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించి ఓవర్‌ స్పీడ్‌గా వెళ్లినందుకు క్షమాపణలు కోరుతున్నాను. అదే సమయంలో మా భద్రత కోసం అలుపెరగకుండా కృషి చేస్తున్న హైదరాబాద్‌ పోలీసులకు ధన్యవాదాలు ‘ అంటూ పోస్ట్ చేసిన కమల్ తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్‌ చేశాడు. మొత్తం మీద హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల పనితీరు ఎలా ఉందో నగరవాసులకు తెలియజేశాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లోనే చదువు..

కాగా మహారాష్ట్రలో పుట్టినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగాడు కమల్ కామరాజు. మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహరల్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చివరిగా ఆయన నాట్యం అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం కుష్బూ భర్త సుందర్ సి నటిస్తోన్న ‘వల్లాన్’ అనే తమిళ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి