AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: మరో విషాదం.. అవమానాన్ని తట్టుకోలేక అజిత్‌ అభిమాని ఆత్మహత్య.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

అజిత్ ఆడంబరాలు, హడావిడికి దూరంగా ఉంటారు. అందుకే తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలన్నింటినీ రద్దు చేశారాయన. కానీ ఫ్యాన్స్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అభిమానం హద్దులు దాటిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Ajith Kumar: మరో విషాదం.. అవమానాన్ని తట్టుకోలేక అజిత్‌ అభిమాని ఆత్మహత్య.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
Ajith Kumar Fan
Basha Shek
|

Updated on: Jan 22, 2023 | 6:50 AM

Share

కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌కు తమిళ నాట ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజైతే చాలు ఎక్కడ చూసినా అజిత్‌ కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లే దర్శనమిస్తుంటాయి. అజిత్ సినిమా ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో చూసేందుకు థియేటర్ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు, గొడవలతో రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే ఇదంతా ఒకవైపు. అజిత్ ఆడంబరాలు, హడావిడికి దూరంగా ఉంటారు. అందుకే తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలన్నింటినీ రద్దు చేశారాయన. కానీ ఫ్యాన్స్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అభిమానం హద్దులు దాటిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల అజిత్‌ లేటెస్ట్‌ సినిమా తునివు (తెలుగులో తెగింపు) రిలీజ్‌ సందర్భంగా ఒకరు లారీపైకి ఎక్కి డాన్స్‌ చేస్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ దుర్ఘటన మర్చిపోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తునివు సినిమా చూడనివ్వలేదని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి ప్రాంతానికి చెందిన వీరబాగు అజిత్ కి వీరాభిమాని. అజిత్ కి సంబంధించిన సినిమాను మొదటి షోనే చూసి ఎంజాయ్‌ చేయాలనుకునేవాడు.

ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా విడుదలైన తెగింపు సినిమాని తన ఫ్యామిలీతో చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. అయితే.. వీరబాగు మద్యం సేవించి ఉండటంతో థియేటర్ యాజమాన్యం అతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు వీరబాగుకి, థియేటర్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. థియేటర్ మేనేజర్ వీరబాగుని అనుమతించమని తేల్చి చెప్పడమే కాకుండా అతన్ని అవమానిస్తూ కుటుంబసభ్యుల ముందే మాట్లాడాడు. ఆ తర్వాత వీరబాగుని బయటికి పంపించి.. అతని కుటుంబ సభ్యులను మాత్రమే లోపలోకి అనుమతించారు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన వీరబాగు.. నేరుగా అక్కడినుండి ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా చూశాక ఇంటికెళ్లిన కుటుంబ సభ్యులు.. వీరబాగుని విగతజీవిగా చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
బాహుబలి మూవీ స్థాయిలో.! ఆ స్టార్ హీరోతో చేసి ఉంటే..
బాహుబలి మూవీ స్థాయిలో.! ఆ స్టార్ హీరోతో చేసి ఉంటే..
ఇదేందిది.. ఫనిష్మెంట్ ఇద్దామని నంబర్ 6లో పంపితే..
ఇదేందిది.. ఫనిష్మెంట్ ఇద్దామని నంబర్ 6లో పంపితే..
రాజమౌళికి షాకిచ్చిన ప్రియాంక చోప్రా
రాజమౌళికి షాకిచ్చిన ప్రియాంక చోప్రా
టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌... ఈ గ్యాప్ మంచిదేనా
టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌... ఈ గ్యాప్ మంచిదేనా