Suhas: మహేశ్‌ నటించిన ఆ సినిమా టికెట్ల కోసం చొక్కా చింపుకున్నా.. సూపర్‌స్టార్‌పై అభిమానం చాటుకున్న సుహాస్‌

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు సుహాస్. ఇక ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్‌ హిట్‌ 2 సినిమాల్లో సైకో కిల్లర్‌ పాత్రలు పోషించి మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

Suhas: మహేశ్‌ నటించిన ఆ సినిమా టికెట్ల కోసం చొక్కా చింపుకున్నా.. సూపర్‌స్టార్‌పై అభిమానం చాటుకున్న సుహాస్‌
Mahesh Babu, Suhas
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2023 | 6:10 AM

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు సుహాస్. ఇక ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్‌ హిట్‌ 2 సినిమాల్లో సైకో కిల్లర్‌ పాత్రలు పోషించి మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ అయితే లభించింది. సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ చూసి మూవీ యూనిట్‌ను ప్రశంసించారు. ట్విట్టర్‌ వేదికగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్‌ లింక్‌ను షేర్‌ చేసిన మహేశ్‌..మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటూ సినిమా నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్ చంద్రలను ట్యాగ్‌ చేశారు. అలాగే సుహాస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. కాగా తన సినిమాపై మహేశ్‌ ట్వీట్‌ చేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు సుహాస్‌. ‘అప్పుడు పోకిరి సినిమా టిక్కెట్ల కోసం వెళ్లి విజయవాడ అలంకార్ థియేటర్ లో నా చొక్కా చిరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసినా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందం వచ్చింది. థాంక్యూ సో మచ్ సార్, హ్యాపీయెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అంటూ మహేశ్‌పై అభిమానం చాటుకున్నాడు.

ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్ ఒక బుక్ రైటర్ గా కనిపించబోతున్నాడు. టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. సీనియర్‌ నటులు రోహిణి, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!