Shiva Balaji: పవన్‌ కల్యాణ్‌కే మా మద్దతు.. ఆయన ఒక్క మాట చెప్తే చాలు.. శివ బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

తన కుటుంబం మొత్తం జనసేన పార్టీకి సపోర్టుగా ఉంటామంటూ ప్రకటించారు ప్రముఖ నటుడు శివబాలాజీ. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ బాలాజీ, మధుమిత దంపతులు మాట్లాడుతూ పవన్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Shiva Balaji: పవన్‌ కల్యాణ్‌కే మా మద్దతు.. ఆయన ఒక్క మాట చెప్తే చాలు.. శివ బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan, Shiva Balaji
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2023 | 6:20 AM

ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఈక్రమంలో కొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో హైపర్‌ ఆది లాంటి వాళ్లు జనసేనానికి అండగా నిలుస్తున్నారు. బహిరంగంగానే పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా తన కుటుంబం మొత్తం జనసేన పార్టీకి సపోర్టుగా ఉంటామంటూ ప్రకటించారు ప్రముఖ నటుడు శివబాలాజీ. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ బాలాజీ, మధుమిత దంపతులు మాట్లాడుతూ పవన్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా పవర్‌స్టార్‌కి పెద్ద అభిమానిని. అయితే నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ నేను ముందు నుంచి పవన్‌ సార్‌కి సపోర్ట్‌గా ఉన్నాను. ఆయన స్థాపించిన నాటి నుంచి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నాం. రాజకీయాల్లోకి రాను కానీ ఆయన ఒక్క మాట చెప్తే చాలు. జనసేన పార్టీ కోసం మరింత క్రియాశీలకంగా పనిచేస్తాం. మా సోషల్‌ మీడియా ద్వారా పవన్‌ సార్ కోసం పని చేస్తాం. నూటికి నూరు శాతం ఆయన కోసం కష్టపడి పని చేస్తాం. పవన్‌ సార్‌కు ఓపిక ఎక్కువ. ఆయనకున్న క్రేజ్‌, పాపులారిటీతో సినిమాలు చేసుకుంటూ కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ ఆయన ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నారు’ అని పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు శివ బాలాజీ.

కాగా పవన్‌కల్యాణ్‌తో కలిసి కాటమరాయుడు సినిమాలో నటించారు శివ బాలాజీ. ఆ సినిమాలో పవన్‌ సోదరుడిగా నటించి మెప్పించారాయన. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విన్నర్‌ అయిన ఆయన ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలంలోనూ ఓ కీలక పాత్రలో కనిపించున్నారు శివబాలాజీ. అలాగే శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో సిందూరం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?