Gurthunda Seethakalam: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన గుర్తుందా శీతాకాలం.. ఎక్కడ చూడొచ్చంటే?
థియేటర్లలో యూత్‌ను మాత్రమే మెప్పించిన గుర్తుందా శీతాకాలం సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ముందుగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. కన్నడలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది.గతేడాది డిసెంబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమాలో సత్యదేవ్ నటన, మిల్కీబ్యూటీ తమన్నా అందచందాలు యువతను బాగా అలరించాయి. కాల భైరవ అందించిన స్వరాలు కూడా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో యూత్‌ను మాత్రమే మెప్పించిన గుర్తుందా శీతాకాలం సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ముందుగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్‌లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. అన్నట్లు ఈ సినిమా ఓరిజినల్ వెర్షన్ లవ్ మాక్‌టైల్ కూడా అమెజాన్‌లోనే అందుబాటులో ఉంది.
కాగా ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా ఈ సినిమాకు ముందు తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. హిందీలో రితేశ్ దేశ్‌ముఖ్‌తో కలిసి నటించిన ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా యావరేజ్‌గానే నిలిచింది. ప్రస్తుతం తమన్నా ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్‌పైనే ఉన్నాయి. ఇందులో కీర్తి సురేశ్ చిరు చెల్లెలిగా కనిపించనుంది. అలాగే రజనీకాంత్‌తో కలిసి జైలర్ సినిమాలోనూ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో తమన్నా పాత్రకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..