Vaarasudu: ఓటీటీకి వచ్చేస్తోన్న వారసుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడ అంటే.?
సినిమాలు రిలీజ్ అయిన ఎనిమిది వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని ఇంకా ముందే వచ్చేస్తున్నాయి కూడా.. అయితే ఇప్పుడు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాల కోసమే.
ప్రేక్షకులు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలకోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో.. అలాగే అవే సినిమాలు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని కూడా ఎదురుచూస్తూ ఉంటారు. సినిమాలు రిలీజ్ అయిన ఎనిమిది వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని ఇంకా ముందే వచ్చేస్తున్నాయి కూడా.. అయితే ఇప్పుడు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాల కోసమే. ఈ ఏడాది సంక్రాంతి రేస్ లో పాల్గొన్న సినిమాల్లో తమిళ్ డబ్బింగ్ సినిమా వారసుడు కూడా ఒకటి. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా జనవరి 11న తమిళ్ లో, 14న మనదగ్గర రిలీజ్ అయ్యింది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచింది కానీ మనదగ్గర మాత్రం ఓకే అనిపించుకుంది. మనకు ఇలాంటి కథలు చాలానే చూశాం.. తమిళ్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక ఈ మూవీలో విజయ్ యాక్టింగ్, డాన్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాయి.
ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ వారసుడు సినిమా ఓటీటీ రైట్స్ ను దక్కించుకుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో వారసుడు సినిమా రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 10న దళపతి వవారసుడు సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో వారసుడు సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్త పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.