Malashri: ఒకప్పటి డ్రీమ్ గర్ల్ మాలా శ్రీ.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. అస్సలు ఊహించలేరు
ఆమె తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. అప్పట్లో మాలా శ్రీ ని డ్రీమ్ గర్ల్ గా పిలుచుకునే వారు. ప్రేమ ఖైదీ సినిమా తర్వాత మాలా శ్రీ, బావా బావమరిది, సూర్యపుత్రులు, సాహసవీరుడు సాగర కన్య, పోలీసు అల్లుడు సినిమాలో నటించింది.

ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమాల్లో లవ్ స్టోరే ఎక్కువ ఉండేవి.. వాటిలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ప్రేమ ఖైదీ. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హరీష్, మాలాశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను నిర్మాత డి. రామానాయుడు ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో కూడా రీమేక్ అయ్యింది. అయితే ఈ సినిమా హీరోయిన్ గా నటించిన మాలా శ్రీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? మాలా శ్రీ అసలు పేరు శ్రీ దుర్గ. ఆమె తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. అప్పట్లో మాలా శ్రీ ని డ్రీమ్ గర్ల్ గా పిలుచుకునే వారు. ప్రేమ ఖైదీ సినిమా తర్వాత మాలా శ్రీ, బావా బావమరిది, సూర్యపుత్రులు, సాహసవీరుడు సాగర కన్య, పోలీసు అల్లుడు సినిమాలో నటించింది.
మాలా శ్రీ జీవితంలో ఎనో కష్టాలు ఉన్నాయి. ఆమె 1989 లో నంజుండి కల్యాణ చిత్రంతో కీర్తి పొందింది, అయితే అదే సంవత్సరంలో ఆమె తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆసమయంలో ఆమె చాలా కష్టాలు చూడాల్సి వచ్చింది. అలాగే ఆమె సునీల్ అనే సహనటుడిని ఇష్టపడింది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని అపట్లో తెగ వార్తలు వచ్చేవి. అయితే మాలా శ్రీ, సునీల్ ఒక కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో మాలా శ్రీ గాయాలతో బయటపడింది.. కానీ సునీల్ మరణించారు.
ఆ తర్వాత మాలా శ్రీ నిర్మాత రామును వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మాలా శ్రీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె ఇప్పుడు ఎలా ఉన్నారు అని కొంతమంది గూగుల్ లో గాలిస్తున్నారు. దాంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Malashri




