Ananta Sriram: మరోసారి వివాదంలో ఇరుకున్న అనంత్ శ్రీ రామ్ .. ఆ కులస్థులను అవమానించారని..
అనంతశ్రీరాం పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు భట్రాజు కులస్తులు. ఇంతకు ఏం జరిగిందంటే..

సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంత్ శ్రీ రామ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. అనంత్ చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతశ్రీరాం పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు భట్రాజు కులస్తులు. ఇంతకు ఏం జరిగిందంటే.. పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పొగడ్తలు అంటూ తమ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని భట్రాజు కులస్తులు ఫిర్యాదు చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఏపీ ప్రభుత్వం నిషేదించిందని అయినా కూడా ఇంకా తమ కులం పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
అనంత్ శ్రీరామ్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. గతంలోనూ ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాశారని ఆయన పై అభ్యంతరం వ్యక్తం చేశారు కొందరు. తాజాగా భట్రాజు కులస్థులు అనంతశ్రీరాం స్టేజ్ పై చేసిన వ్యాఖ్యల వీడియోలని జత చేసి ఫిర్యాదు చేశారు.
పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పొగడ్తలు అంటూ కామెంట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిందని.. అయినా కూడా తమను అవమానపరిచేలా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో చూడాలి.




